మీ ఫోన్ నీటిలో పడితే ఆందోళన పడకుండా ఇలా చేస్తే మీ ఫోన్ కి రిపేర్ రాకుండా చేయచ్చు.. తెలుగు లో వివరంగా స్టెప్ బై స్టెప్

Loading...

 • స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే మనకు అసలు పని జరగదు.. ఇప్పుడు ఏ పని అయిన మనము సులువుగా మొబైల్ లో నెట్ ఓపెన్ చేసుకొని ఉన్నచోటే నుంచే అన్ని పనులు చేస్తున్నాము. ఒకరినుంచి ఇంకొకరికి సమాచారం కూడా నిముషాలలో చేరవేస్తుంది. మరి అలాంటి మొబైల్ చేజారి నీటిలో పడిపోయింది అనుకోండి మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ విధంగా జరిగినపుడు మనము ఆందోళన పడకుండా క్రింద చెప్పిన విధంగా చేస్తే మొబైల్‌కి రిపేర్ రాకుండా చేయచ్చు. 
 • మొబైల్ నీటిలో పడినపుడు ఆన్ చేయటం గాని బటన్స్ నొక్కటం గాని చేయకూడదు.
 • మొబైల్‌ను విసరటం మరియు ఊపటం, ఫోన్ పార్ట్స్‌ను విడదియటం వంటివి చేయకూడదు.
 • మొబైల్‌లో నీటిలో పడినపుడు అందులోకి నీరు చేరుతుంది అప్పుడు మనము నోటితో గాలిని ఊదకూడదు. ఈ విధంగా చేస్తే నీరు డివైస్‌లోని సున్నితమైన ప్రాంతాలలోకి వెళ్లి ఎక్కువ డ్యామేజ్‌కు అయ్యేలా చేస్తుంది.
 • ఎటువంటి పరిస్థితులలో మొబైల్ ను వేడి చేయకూడదు.
 • మొబైల్ నీటిలో పడినపుడు ఆన్ లో ఉంటే వెంటనే ఆఫ్ చేయాలి.
 • మొబైల్ ఫ్లిప్ కవర్ మరియు బ్యాక్ కేస్, సిమ్, మెమోరీ కార్డు, బ్యాటరీలను అన్ని తిసివేయాలి.
 • మొబైల్ నీటితో తడిసినపుడు పొడి గుడ్డ లేదా పేపర్ టవల్ తో ఆరేవరకు తుడవాలి. మొబైల్‌లో నీరు వేరే చోట కు వెళ్ళకుండా జాగ్రత్తగా ఈ పని చేయాలి.
 • ఇంకా మొబైల్‌లో నీరు ఉంటే వాక్యూమ్‌తో తీసివేయాలి.
 • మొబైల్‌ను బియ్యం ఉన్న కవర్‌లో పెట్టి పూర్తిగా మూయాలి. నీటిని పీల్చుకొనే గుణము బియ్యానికి ఉన్నాయి. ఇలా చేయటం వలన కూడా ఉపయోగముంటుంది.
 • బియ్యంలోనే ఒకటి రెండు రోజులు మొబైల్‌ను అలానే ఉంచి తర్వాత తీసి వాడుకోవచ్చు. ఇలా చేసిన కూడా మొబైల్ పని చేయకపోతే మొదట ఛార్జింగ్ పెట్టి చూడండి. అప్పుడు కూడా పని చేయకపోతే బాటరీ మార్చాలి. ఇక దేనివల్ల పని చేయకపోతే సర్వీస్ సెంటర్‌కి తీసుకుని వెళ్ళండి. ఒక్కోసారి మొబైల్ పనిచేస్తుంటాయి అప్పుడు కొన్నిరోజుల తర్వాత హార్డ్‌వేర్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకోండి.
Loading...

Popular Posts