మొటిమల వలన ఏర్పడే గుంటలు, మచ్చలు పోగొట్టుకోవడానికి ఇంట్లోనే ఉపాయాలు ఉన్నాయి

Loading...
మొటిమల వలన ఏర్పడే గుంటలు, మచ్చలు ముఖ సౌందర్యాన్నీ పూర్తిగా దెబ్బతీస్తాయి మొటిమలు, వాటి వలన ఏర్పడే గుంటలు మచ్చలు పోగొట్టుకోవడానికి ఇంట్లోనే ఉపాయాలు ఉన్నాయి.
  • గంధం, పసుపు సమానంగా తీసుకోండి. ఆల్మండ్ ఆయిల్ ఈ మిశ్రమంలో కలిపి ముఖానికి పట్టండి. ఈ ఫేస్ ప్యాక్ ని కనీసం 20 నిమిషాలపాటు ఉంచి ఆ తరువాత కడిగేయ్యండి. ఇలా రోజూ చెయండి.
  • ఐస్ క్యూబ్ తో ప్రతీరోజు రెండు మూడు సార్లు ఫేస్ మసాజ్ చేయండి. ఐస్ క్యుబ్ మాసాజ్ వలన ముఖనికి రక్తప్రసరణ బాగా జరిగి గుంటలు, రంధ్రాలను త్వరగా కప్పివేయడానికి ఉపయోగపడుతుంది.
  • రోజ్ వాటర్, కుకుంబర్ జ్యూస్ తో ఓ మిశ్రమాన్ని తయారుచేసుకోని రోజూ ముఖానికి పట్టండి. కాటన్ తో ముఖంపై ఈ మిశ్రమాన్ని రుద్దితే మంచిది. ఓ అరగంటసేపు అలాగే ఉంచి ఆ తరువాత కడిగేసుకోవాలి.
  • బాదం గింజలు, నిమ్మరసంతో ఓ మిశ్రమాన్ని చేసుకోని ముఖానికి పట్టండి. ఓ 20 నిమిషాలపాటు ఈ ఫేస్ ప్యాక్ ని అలాగే ఉంచి కడిగేసుకుంటే మంచిది.
  • జిడ్డు చర్మం ఉన్నవాళ్లు, ఒక ఎగ్ వైట్ ని తీసుకొని, రెండు అస్పిరిన్ ట్యాబ్లెట్లు, పెరుగు కలిపి బాగా మిక్స్ చేసుకోని రోజు ఓ 20 నిమిషాల పాటు ముఖానికి పట్టాలి.
  • తేనే చర్మాన్ని ఎన్నోవిధాలుగా కాపాడుతుంది. దీనిలో ఉండే యాంటి బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్, పొటాషియం, మొటిమలు, వాటి గుర్తులతో పోరాడతాయి. రోజూ తేనేతో ఓ 15-20 నిమిషాలపాటు మసాజ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే, అందమైన ముఖం మీ సొంతం.
Loading...

Popular Posts