హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలిస్తుంది. వాటిని మనం పసిగట్టి, తొందరగా డాక్టర్ ని ఆశ్రయించాలి

Loading...
  • హార్ట్ ఎటాక్ చెప్పి రాదు కదా. వస్తే ఉంటామో పోతామో కూడా చెప్పలేం. అలాంటి ప్రమాదకరమైన హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలిస్తుంది. వాటిని మనం పసిగట్టి, తొందరగా డాక్టర్ ని ఆశ్రయించాలి. 
  • కారణం లేకుండా మైకం కమ్మినట్టు అనిపించడం, తలనొప్పి మాటిమాటికి వస్తుండటం మంచి సంకేతాలు కాదు. మీ గుండె మెదడుకి రక్తాన్ని సరిగా సరఫరా చేయలేకపోతోంటే ఇలా జరుగుతుంది. దీనర్థం గుండె ఆరోగ్యంగా లేదు. 
  • ఛాతి పట్టేసినట్టు, మంటగా, నొప్పిగా, గుండెమీద బరువు మోపినట్టు రెగ్యులర్ గా అనిపిస్తే గుండె ప్రమాదంలో ఉన్నట్టే. 
  • దీర్ఘకాలిక ఇంఫెక్షన్లు కనబడితే అలర్ట్ అవండి. గుండెకి ఆక్సిజన్ సరిగా అందకపోతే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. తద్వారా వారాలకొద్ది, నెలల కొద్ది, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. 
  • పనేం చేయకుండానే అలసిపోవడం, అసలేమాత్రం ఉత్సాహంగా ఉండకపోవడమే కూడా ప్రమాదకర సంకేతాలు. 
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, గుండె ప్రమాదంలో ఉన్నట్లే. గుండె ఆరోగ్యంగా లేకపోతే ఊపిరితిత్తులు కూడా సరిగా పనిచేయలేవు. 
  • చేతులు, పాదాలు, పొట్ట దగ్గర వాపులు కనబడుతున్నాయంటే గుండె రక్తాన్ని సరిగా శుద్ధి చేయలేకపోతోంది అన్నమాట. అలాంటిప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించండి. 
  • మంచి ఆహారం తీసుకున్నా వికారం, అజీర్ణం లాంటి సమస్యలతో పాటు ఛాతిలో మంటగా అనిపిస్తే జాగ్రత్తగా మెదలడం మొదలుపెట్టండి. వైద్యుడిని సంప్రదించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
Loading...

Popular Posts