మీరు ఐడి ప్రూఫులు, అడ్రస్ ప్రూఫులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త.. ఇతరులు వాటిని వాడకుండా ఇలా చేయండి

ఇప్పుడు భారతదేశం ప్రూఫుల మీద నడుస్తుంది. ఏం చేయాలన్నా, ఏం కావాలన్నీ ఐడి ప్రూఫులు, అడ్రస్ ప్రూఫులు ఉండాల్సిందే. సిమ్ కార్డుల నుంచి మొదలు ఇంటిలోన్ల వరకూ.. ప్రూఫ్ లేనిదే ఏ పనీ జరగదు. కొత్తగా సిటీలకు వచ్చిన వాళ్లు, ఊరు మారిన వాళ్లకు ఇదే పెద్ద సమస్య. లోన్ కావాలన్న ఆరాటంలోనే, కొత్త సిమ్ తీసుకునే తొందరలోనో, మరో పనికో ఎవరికి పడితే వారికి ఏజెంట్లంటూ వచ్చే ప్రతీ ఒక్కరికీ మన ఐడి ప్రూఫ్, ఎడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్టు సైజు ఫోటోలు ఇవ్వడం తప్పదు.

కానీ మీరు ఇచ్చిన ప్రూఫ్స్ మిస్‌యూజ్ అవ్వవని నమ్మకం ఉందా? వాటిని తీసుకున్న వాళ్లు పద్ధతిగా కాపాడతారని గ్యారెంటీ ఏంటి? పైగా మీరు వాటిపై సంతకం కూడా పెడతారు. చాలా తీవ్రవాద కార్యకలాపాలు, ఇతర నేరాలలో సిమ్ కార్డులు వేరే వాళ్ల పేరిటో, అమాయకులైన వారి పేరిటో ఉండడం తెలిసిందే. మరి మీ పేరును, ఫోటోలనూ ఎవరూ వాడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఇకపై మీరు ఎవరికి ఐడి ప్రూఫులు ఇచ్చినా, దానిపై సంతకం పెట్టడంతో పాటూ ఆ ప్రూఫ్ ఎప్పుడు ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం అనే విషయాలు రాయండి. ఇక అది మిస్‌యూజ్ అయ్యే అవకాశం ఉండదు. అంటే మీరు మీ ఓటర్ కార్డు ఇచ్చారనుకుందాం. కింద సంతకంతో పాటూ డేట్ వేయండి. దాని కిందే ఆ ఫామ్ ఎందుకు ఇచ్చామో రాసి, మిగిలిన వాటికి వాడ వద్దని రాయండి.

Sign, Date, Purpose (for sim card, for bank ac, for personal loan etc.) రాసి, అప్పుడు, ఇతర పనులకు వాడవద్దని కూడా రాయండి. Not to be used for other purpose.

ఇంగ్లీషు కాకపోతే, తెలుగులో రాసినా ఏం నష్టం లేదు. సంతకం, తేదీ తరువాత (సిమ్ కార్డు/లోన్/ఎక్కౌంట్ కోసమే. ఇతర పనులకు కాదు.) అని రాయవచ్చు.

ఎవరికి పడితే వారికి కాకుండా, ఆథరైజ్డ్ ఏజెంట్లకు మాత్రమే ప్రూఫులు ఇవ్వండి. ప్రూఫులు ఇచ్చినట్టుగా రశీదు (ఎక్నాలెజ్మెంట్) తీసుకోండి. నువ్వే జిరాక్స్ తీయించు, నేను తరువాత తీసుకుంటానని పొరబాటున కూడా అనకండి. మీ ఐడి, అడ్రస్ ప్రూఫులు ఏటిఎం, క్రెడిట్ కార్డులతో సమానం.
మీరు మాత్రమే కాకుండా. మీ స్నేహితులు, బంధువులు ఇబ్బందులు పడకుండా వారికి ఈ సమాచారం షేర్ చేయండి.
Source:- సతీశ్ – facebook.com/ballasatish
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)