ఎముకలు అరిగిపోకుండా ఎప్పటికీ బలంగా ఉండాలంటే భోజనం చేసిన తర్వాత ఈ ఆకు ఒక్కటి తినండి చాలు

హిందూ సంస్కృతిలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తమలపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. భగవంతుని పూజలో తమలపాకులను వాడుతూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే తమలపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎ విటమిన్, సి విటమిన్, కాల్షియం, పోలిక్ యాసిడ్ తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి.

ముఖ్యంగా తాంబూలంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత శక్తి ఉంది. తమలపాకులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు తమలపాకు చాలా మేలు చేస్తుంది. అనేక రకాలైన విషాలను హరించగల ఔౌషధ గుణాలు తమలపాకులో ఉన్నాయి. చిన్న పిల్లలకు జలుబు చేసినప్పుడు తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తే జలుబు, దగ్గు దూరమవుతాయి.

తమలపాకుతో సున్నం కలిపి వేసుకుంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది ఎప్పటికీ ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది. ఎముకలు ధృడంగా బలంగా ఉంచటంలో తమలపాకు సున్నం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. బాలెంతలు తాంబూలం వేసుకుంటే ఎంతో మంచిది. వక్క, తమలపాకు మరియు సున్నం రెండింటినీ అనుసంధానం చేసి శరీరంలో వేడి పెరగకుండా సమతుల్యం చేస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)