కొత్తగా పెళ్ళైన దంపతులు మొదటి ఆషాడం దూరంగా ఎందుకు ఉండాలి ? అది కేవలం ఆచారమో సాంప్రదాయమో కాదు అది సైన్సు

మన పూర్వీకులు మనకు పెట్టిన ప్రతి ఆచారంలోను, సంప్రదాయంలోను అర్థం - పరమార్థం దాగి ఉంటుంది. ఆషాఢ మాసం అనగానే గుర్తుకు వచ్చే విషయం. వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే ఇంట్లో కలిసి ఉండరాదని, పెళ్ళయిన తొలి ఆషాఢమాసంలో అత్తాకోడళ్ళూ ఒకే గడప దాటకూడదనేది మన తెలుగు వారి సంప్రదాయం. సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే ఈ సంప్రదాయంలో కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆషాఢ మాసంలో భార్యభర్తలు కలిసుంటే గర్భం ధరించి బిడ్డ పుట్టేసరికి చైత్ర, వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభం. ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు. 
అలాగే ఆషాఢ మాసంలో కొత్త అల్లుడు కూడా అత్తగారింటికి వెళ్ళకూడదనే నియమం కూడా ఉంది. ఈ నియమాన్ని పరిశీలిస్తే ఆషాఢ మాస సమయంలో అప్పుడే పొలం పనులు ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తింటి వారు అతిథి మర్యాదలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పొలం పనులకు అంతరాయం కలుగుతుంది. పెళ్ళైయిన మొదట్లో భార్యభర్తలకు ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలు, ఆకర్షణలు ఉంటాయి. ఈ మాసంలో దూరంగా ఉండటం వల్ల ఎడబాటు బాధ వారికి తెలుస్తుంది. విరహం ప్రేమను మరింత బలపరుస్తుంది. జీవితంలో మళ్ళీ ఎప్పుడు జీవిత భాగస్వామికి దూరంగా ఉండకూడదనే అభిప్రాయం వారికి కలుగజేస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)