ఉదయం 7 నుంచి 9 గంటలలోపు కాఫీ అస్సలు తాగకూడదు... కాఫీ ఏ సమయాలలో తాగాలో తెలుసుకోండి

కొందరు ఉదయాన్నే కడుపులో కాఫీ పడందే ఏ పనీ చేయలేరు. ఉదయం బద్ధకం నుంచి చురుకుగా మారడానికి చాలా మంది కాఫీని ఆశ్రయిస్తారు. అయితే ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటలలోపు కాఫీ తాగకూడదట. బెతెస్డాలోని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెన్‌ పరిశోధకులు ఈ విషయం ప్రకటించారు. ప్రతీ రోజూ ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రతీ వ్యక్తిలోనూ ‘కార్టిసాల్‌’ అనే హార్మోన్‌ అధిక మోతాదులో విడుదలవుతుందట. నిద్ర మత్తు నుంచి మనిషిని పూర్తిగా బయటకు తీసుకురావడానికి ఇంటర్నల్‌ బాడీ క్లాక్‌ ఈ హార్మోన్‌ను విడుదల చేయిస్తుంది. ఈ హార్మోన్‌ ప్రభావం వల్ల మానవులు చురుకుగా, అలర్ట్‌గా ఉంటారు. అది ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియ. కాఫీ తాగకపోయినా ఆ ప్రక్రియ ఆగదు. అయితే ఆ సమయంలో కాఫీ తాగడం వల్ల ప్రయోజనం లేకపోగా, నష్టం ఉందట. కాఫీ తాగడం వల్ల శరీరంలో కార్టిసాల్‌ మరింత ఎక్కువ మోతాదులో విడుదలవడంతో హర్మోన్ల సమస్య తలెత్తుతుందట.

రోజులో కార్టిసాల్‌ హర్మోన్‌ విడుదల ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుందట. ఉదయం ఏడు నుంచి తొమ్మిది మధ్య చాలా ఎక్కువ స్థాయిలో ఇది విడుదలవుతుందట. ఇక, ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 5 గంటల మధ్య ఈ హార్మోన్‌ విడుదల తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కాఫీ తాగితే ఉత్తమమట.

Popular Posts

Latest Posts