వేగంగా బరువు తగ్గించే 10 సూత్రాలు... తప్పకుండా వెంటనే ఫాలో అవ్వండి

    త్వరగా బరువు తగ్గితే బాగుండు అనుకుంటున్నారా. అయితే వేగంగా బరువు తగ్గించే ఓ పది సూత్రాల్ని వెంటనే ఫాలో అవ్వాలి.
  • ఉదయం ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ తినాలి. అలా తినడం వల్ల మిగతా రోజంతా ఆకలి అంతగా ఉండదు. అదనంగా తినడం తగ్గుతుంది.
  • తియ్యటి పానీయాలు, పళ్ల రసాలు దరిచేరనీయొద్దు. ఇవి శరీరంలోకి కొవ్వును చేరుస్తాయి. అందుకని వీటికి దూరంగా ఉంటే బరువు తగ్గడం తేలికవుతుంది.
  • భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగాలి. మూడునెలల పాటు ఇలా చేస్తే బరువు తగ్గే వేగం 44 శాతం పెరుగుతుందని ఒక స్టడీ వెల్లడి చేసింది.
  • సాల్యుబుల్‌ ఫైబర్‌ కొవ్వును తగ్గిస్తుంది. అదికూడా పొట్ట ప్రాంతంలో. అందుకని సాల్యుబుల్‌ ఫైబర్‌ కలిగి ఉన్న ఓట్‌ బ్రాన్‌, బార్లీ, నట్స్‌, సీడ్స్‌, బీన్స్‌, లెంటిల్స్‌, బఠాణీలు, కొన్ని పళ్లు, కూరగాయల వంటివి తినాలి.
  • కాఫీ, టీలు సేవించే అలవాటు ఉందా. అయితే ఎంచక్కా వాటిని తాగొచ్చు. వీటిలో ఉండే కెఫైన్‌ జీవక్రియల్ని 3-11 శాతం పెంచుతుంది.
  • ప్రాసెస్‌ చేయని ఆహారాన్నే తినాలి. ఈ ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పొట్టని నిండుగా ఉంచి మితంగా తినేలా చేస్తాయి.
  • గబగబా తినే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానాలి. ఎందుకంటే ఇలా తినేవాళ్లు కొంతకాలంలోనే ఎక్కువ బరువు పెరుగుతారు. నెమ్మదిగా తినేవాళ్లకి పొట్ట నిండుగా ఉంటుంది. బరువును తగ్గించే హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది.
  • చిన్న  పళ్ళెం లో తింటే మీకు తెలియకుండానే తక్కువ తింటారని పరిశోధనల్లో వెల్లడైంది. సో... ఇక నుంచి చిన్న పళ్లెం లోనే తినడం మొదలుపెట్టండి.
  • ప్రతిరోజూ రాత్రి హాయిగా నిద్రపోండి. సరిగా నిద్రపోలేదో బరువు పెరిగిపోతారు. అందుకని నిద్ర పట్ల దృష్టి పెట్టండి.

Popular Posts

Latest Posts