పంక్షన్ కీస్ F1 నుండి F12 దాకా కంప్యూటర్లో షార్ట్ కట్ కీలుగా ఏం పనులు చేయచ్చో ఓ లుక్కేయండి

కీ బోర్డ్ లో పంక్షన్ కీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. F1 తో మొదలు పెడితే F12 దాకా ఉంటాయి. అయితే వీటితో కంప్యూటర్లో ఏం పనులు చేయొచ్చు. ఈ కీలను మీరు షార్ట్ కట్ కీలుగా ఎలా ఉపయోగించుకోవచ్చు. వీటితో ఏయే ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఇలాంటి అంశాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
Loading...


F1 తో ఏం చెయొచ్చు
Windows Key + F1 నొక్కడం ద్వారా మీరు విండోస్ కి సంబంధించిన హెల్ప్ సెంటర్ కు నేరుగా వెళ్లవచ్చు. అలా కాకుండా నేరుగా ఎఫ్ 1 నొక్కినా కాని మీరు హెల్ప్ సెంటర్ కు వెళ్లవచ్చు.
F2 తో ఏం చెయొచ్చు
మీరు ఏ ఫైల్ కన్నా రీ నేమ్ ఇవ్వాలనుకుంటే ఎఫ్2 నొక్కడం ద్వారా నేరుగా ఇవ్వవచ్చు. Alt + Ctrl + F2 నొక్కడం ద్వారా మీరు మైక్రోసాప్ట్ వర్డ్ లో డ్యాక్యుమెంట్ విండోను ఓపెన్ చేయవచ్చు. Ctrl + F2 నొక్కడం ద్వారా మీరు వర్డ్ డాక్యుమెంట్ లొ ప్రింట్ ప్రివ్యూను చూడొచ్చు.
F 3 తో ఏం చెయొచ్చు
F 3 ని నొక్కడం ద్వారా మీరు నేరుగా సెర్చ చేయొచ్చు. మీకు సెర్చ్ ఆప్సన్ ఓపెన్ అవుతుంది. Shift + F3 నొక్కడం ద్వారా మీరు మైక్రోసాప్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో మీ టెక్ట్స్ అప్పర్ కేస్ ,లోయర్ కేస్ కు మార్చుకోవచ్చు. Windows Key + F3 నొక్కడం ద్వారా మీరు పైండ్ ఆప్సన్ వస్తుంది.
F 4 తో ఏం చెయొచ్చు
Alt + F4 నొక్కడం ద్వారా మీరు మీ టాస్క్ బార్ మొత్తాన్ని ని క్లోజ్ చేయవచ్చు. Ctrl + F4 నొక్కడం ద్వారా మీరు టాస్క్ బార్ లో ఒక్కో పోగ్రాం క్లోజ్ చేసుకుంటూ వెళ్లవచ్చు.
F 5 తో ఏం చెయొచ్చు
నోట్ ప్యాడ్ లో ఉన్నప్పుడు ఎఫ్ 5 నొక్కితే మీకు టైం డేట్ కనిపిస్తుంది. అలాగే బ్రౌజర్ రీ ప్రేష్ చేయాలంటే షార్ట్ కట్ కీ గా ఎఫ్ 5ని ఉపయోగిస్తారు. పవర్ పాయింట్ లో స్లైడ్ షోల కోసం నేరుగా ఎఫ్ 5 నొక్కి పొందవచ్చు. వర్డ్ లో అయితే ఫైండ్, రీప్లేస్ లాంటి ఆప్సన్ కోసం ఎఫ్ 5 బటన్ ఉపయోగిస్తారు.
Loading...


F 6 తో ఏం చెయొచ్చు
F 6 నొక్కడం ద్వారా నేరుగా మీరు అడ్రస్ బార్ లోకి వెళతారు. మీరు ఏ బ్రౌజర్ లో ఉన్నా కాని నేరుగా అక్కడికి వెళ్లిపోవచ్చు. Ctrl + Shift + F6 నొక్కడం ద్వారా మీరు నేరుగా మరొక మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ ని వర్డ్ లో ఓపెన్ చేయవచ్చు. ల్యాప్ టాప్ ల కయితే స్పీకర్ వాల్యూంని తగ్గించుకోవడానికి F6ని వాడుతారు.
F 7 తో ఏం చెయొచ్చు
వర్డ్ డాక్యుమెంట్ లో గ్రామర్ ,స్పెల్లింగ్ చెక్ లకు ఈ బటన్ ఉపయోగిస్తారు. Shift + F7 నొక్కడం ద్వారా వర్డ్ డాక్యుమెంట్ లో వర్డ్ ని హైలెట్ చేయవచ్చు. ల్యాప్‌టాప్‌ల‌కు అయితే స్పీకర్ వాల్యూంని పెంచుకోవడానికి F6ని వాడుతారు.
F 8 తో ఏం చెయొచ్చు
విండోస్ ని సేఫ్ మోడ్ లోకి తీసుకెళ్లేందుకు ఈ బటన్ ఉపయోగిస్తారు.
F 9 తో ఏం చెయొచ్చు
వర్డ్ డాక్యుమెంట్ లో రీ ఫ్రెష్ కోసం ఈ బటన్ ఉపయోగిస్తారు. ల్యాప్‌టాప్‌ల‌కు అయితే బ్రైట్ నెస్ తగ్గించునేందుకు దీన్ని వాడుతారు.
Loading...


F 10 తో ఏం చెయొచ్చు
Shift + F10 నొక్కడం ద్వారా నేరుగా మీరు రైట్ క్లిక్ చేయవచ్చు. ల్యాప్‌టాప్‌ల‌కు అయితే బ్రైట్ నెస్ పెంచునేందుకు దీన్ని వాడుతారు.
F 11 తో ఏం చెయొచ్చు
ఈ బటన్ నొక్కడం ద్వారా మీరు పుల్ స్కీన్ పొందవచ్చు. అదే బటన్ మళ్లే ప్రెస్ చేయడం ద్వారా నార్మల్ స్టేజ్ కి రావచ్చు.
F 12 తో ఏం చెయొచ్చు
వర్డ్ డాక్యుమెంట్ లో సేవ్ విండ్ ని ఓపెన్ చేసేందుకుఈ బటన్ ఉపయోగిస్తారు. Ctrl + F12 నొక్కడం ద్వారా డాక్యుమెంట్ వర్డ్ ఓపెన్ చేయవచ్చు. Shift + F12 నొక్కడం ద్వారా మీరు వర్డ్ లో ఫైల్ సేవ్ చేయవచ్చు. Ctrl + Shift + F12 నొక్కడం ద్వారా మీరు నేరుగా ప్రింట్ ఆప్సన్ కెళ్లి పోవచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)