లక్షలు పోసినా దొరకని మెడిసిన్ సీటుని ఫ్రెండ్ కోసం త్యాగం చేసి స్నేహం అంటే ఇదేరా అని చాటి చెప్పింది. షేర్ చేసి స్నేహం విలువ అందరికి చాటి చెప్పండి.

Loading...
పైన కనపడుతున్న ఫోటో లో ని ఎడమ వైపు ఉన్న అమ్మాయి పేరు వర్షిణి కుడి వైపు ఉన్న అమ్మాయి పేరు జనని. వీళ్ళిద్దరూ తిరుచ్చిలోని సమయపురంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఎల్‌కేజీ నుంచీ ఫ్రెండ్స్. ఇద్దరికీ డాక్టర్ కావాలనే కోరిక.. చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకూ కలసి చదివారు. మెడిసన్ కోసం ఇద్దరూ కలిసే ప్రిపేర్ అయ్యారు. ఇద్దరూ ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలే కావడంతో ఆ కోటాలో సీటు కోసం కౌన్సిలింగుకు వచ్చారు.
వర్షిణికి జనని కంటే కాస్త మంచి ర్యాంకు వచ్చింది. ముందుగా వర్షిణి కౌన్సిలింగుకు వెళ్లింది. వెనుకే జనని. అయితే మద్రాస్ మెడికల్ కాలేజీలో ఒకే సీటు మిగిలింది. మార్కులు చూస్తే ఇద్దరి మధ్యా కేవలం 0.25 శాతం మాత్రమే తేడా. వర్షిణికి సీటు వచ్చింది. జనని అప్‌సెట్ అయింది.
జననిని చూసిన వర్షిణి బాధ పడింది. స్నేహితురాలి బాధ తన బాధే అనుకుంది. తను ఆ సీటు వదిలేసుకుంటే ఫ్రెండుకు వస్తుంది. వెంటనే తనకు ఆ కాలేజీలో సీటు వద్దని కౌన్సిలింగులో చెప్పేసింది. దీంతో ఆ సీటు జననికి వచ్చింది. లక్షలు పోసినా దొరకని మెడిసిన్ సీటుని ఫ్రెండ్ కోసం చేసిన ఈ త్యాగాన్ని అందరూ మెచ్చుకుని అసలైన ' స్నేహం అంటే ఇదేరా' అంటూ తెగ పొగిడేస్తున్నారు. మీరు కూడా షేర్ చేసి స్నేహం విలువ అందరికి చాటి చెప్పండి.
Loading...

Popular Posts