తల స్నానం ఉదయం కంటే రాత్రిళ్ళు చేస్తేనే మంచి ఫలితాలు

  • మనం జుట్టుని ఉదయం శుభ్రం చేసుకుంటాం. అంటే తలస్నానం ఉదయం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇది చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా.. జుట్టుని చాలా అందంగా కనిపించేలా చేస్తుందని నిపుణులు సూచిస్తారు. కానీ జుట్టుని ఉదయం కంటే రాత్రి శుభ్రం చేసుకోవడమే మంచిదని స్టడీస్ చెబుతున్నాయి.
  • ఉదయం తలస్నానం చేయడం అనేది కాస్త ఇబ్బందికరమైనది. ఎందుకంటే తలస్నానం చేయాలంటే కాస్త త్వరగా నిద్రలేవాలి. కొన్నిసార్లు క్లైమెట్ లో హఠాత్తుగా మార్పులు వచ్చినా.. నిద్రలేవడం కష్టమవుతుంది. అయితే రాత్రిళ్లు తలస్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు తలస్నానం చేస్తే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ రాత్రిపూట తలస్నానం వల్ల హాయిగా నిద్రపోతారు కూడా. ఇది మాత్రమే కాదు.. రాత్రిళ్లు తలస్నానం చేస్తే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
  • ఎక్కువ సమయం రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల ఎక్కువ సమయం మీకు దొరుకుతుంది. దీనివల్ల ఎక్కువ శ్రద్ధగా, శుభ్రంగా తలను క్లీన్ చేసుకుంటారు. అయితే మరీ ఎక్కువ సమయం క్లెన్స్ చేసినా.. జుట్టు డ్యామేజ్ అవుతుంది.
  • న్యాచురల్ ఆయిల్స్ రాత్రిళ్లు తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్ న్యాచురల్ ఆయిల్స్ ని కోల్పోకుండా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ డ్రైగా కనిపించకుండా ఉంటుంది.
  • ఎండకు డ్యామేజ్ తలస్నానం చేసిన వెంటనే ఎండకు బయటకు వెళ్లడం వల్ల.. మీ జుట్టు బలహీనం అవుతుంది. రఫ్ గా మారుతుంది. కాబట్టి రాత్రిళ్లు తలస్నానం చేయడమే మంచిది.
  • వేడి హీట్ స్టైలింగ్ టూల్స్ ని తలస్నానం చేసిన వెంటనే ఉపయోగించడం మంచిది కాదు. ఈ సమయంలో జుట్టు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి రాత్రిపూట తలస్నానం చేసి.. మరుసటి రోజు ఉదయం స్టైలింగ్ టూల్స్ ఉపయోగించడం మంచిది.
  • హెయిర్ స్టైల్స్ తలస్నానం చేసిన వెంటనే జుట్టు హెయిర్ స్టైల్స్ కి అంత సహకరించదు. తలస్నానం చేసిన వెంటనే జారిపోయే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి రాత్రిళ్లు తలస్నానం చేస్తే.. ఉదయం తేలికగా జుట్టుని మీకు నచ్చినట్టు స్టైల్ చేసుకోవచ్చు.
  • అనారోగ్యం ఒకవేళ మీరు చాలా సెన్సిటివ్ అయి ఉండి, త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావిస్తే.. మీరు రాత్రిళ్లు తలస్నానం చేయడమే మంచిది. ఉదయం తలస్నానం చేస్తే త్వరగా జలుబు వంటి సమస్యలు వస్తాయి.
  • డ్రైచేసే టైం ఒకవేళ మీరు రాత్రిళ్లు జుట్టుని శుభ్రం చేస్తే.. డ్రై చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. ఉదయం తలస్నానం చేస్తే.. ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు మీరు కోరుకున్నంత ఎట్రాక్టివ్ గా కనిపించదు. అలాగే ఉదయం ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో చాలామంది తలను ఆర్పుకోరు కూడా. కాబట్టి రాత్రిళ్లు తలస్నానం చేస్తే ఆర్పుకోవడానికి ఎక్కువ టైం దొరుకుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)