ఈ నియమాలు కచ్చితంగా ఫాలో అయితే బరువు తగ్గడమే కాదు సంపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి

ఆహారపు అలవాట్లు, పని సమయం వేళలు మారిపోవడంతో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. బరువు ఒకటే అయితే పెద్ద ప్రాబ్లమ్ కాదు.. కాని ఒబెసిటీ కారణంగా అనేక జబ్బులు వస్తాయి. దీంతో బరువు తగ్గడానికి చాలా మంది చాలా అవస్థలు పడుతుంటారు. క్రమం తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తే వెయిట్ లాస్ పెద్ద కష్టమేమీ కాదు.
 • ఉదయం లేవగానే పొట్ట భాగంలో నూనెతో (కొబ్బరి నూనె /నువ్వులనూనె /ఆలివ్ నూనె ) 5 నుండి 10 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.
 • తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని తాగాలి.
 • 30 నిముషాలు వ్యాయామం (వాకింగ్ /జాగింగ్) చేయాలి.
 • 10 నిముషాల పాటు ఉదయపు సూర్యకాంతిలో ఉండాలి.
 • స్నానానికి గోరువెచ్చని నీళ్ళను ఉపయోగించాలి.
 • 9 గంటల్లోపు అల్పాహారం పోషకాలు ఉండేట్లు పుష్టికరంగా తీసుకోవాలి.
 • మ. 1 గంట లోపు లంచ్ మధ్యమంగా తీసుకోవాలి.
 • రా.9 గంటల్లోపు భోజనం ముగించుకోవాలి.
 • సి -విటమిన్ ఉన్న పండ్లు బత్తాయి, నారింజ, కమల, నిమ్మ, స్ట్రాబెర్రీ, ఆపిల్, బెర్రీస్ తీసుకోవాలి.
 • రోజులో కనీసం 3-4 లీటర్ల నీటిని తాగాలి.
 • భోజనంలో ఆకుకూరలు, నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి.
 • బయట దొరికే జంక్ ఫుడ్ కి పూర్తి దూరంగా ఉండాలి.
 • మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.
ఈ నియమాలు కచ్చితంగా ఫాలో అయితే బరువు తగ్గడమే కాదు సంపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయండి.

Popular Posts

Latest Posts