పుట్టుమచ్చల ద్వారా మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మీరే తెలుసుకోండి. ప్రముఖులు చెప్పిన విషయాన్ని యథాతథంగా మీకు అందిస్తున్నాము.

మన శరీరంలో వివిధ భాగాలలో ఉన్న పుట్టుమచ్చల ద్వారా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ప్రముఖులు చెప్పిన విషయాన్ని యథాతథంగా మీకు అందిస్తున్నాము. అయితే ఇంకెందుకు ఆలస్యం మీకు ఎక్కడ పుట్టుమచ్చలున్నాయో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మీరే తెలుసుకోండి…

 • నోరు లేదా గడ్డంపై పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అందమైన వారు. ఈ పుట్టుమచ్చ కలిగిన వారు సంతులిత జీవితాన్ని గడుపుతారు. ఒకరిని బాధపెట్టకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోతారు.
 • తల నుదుటిపైన కుడిభాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఆరోగ్యం, విజయం, కీర్తి ఎప్పుడూ మీ వెనకాలే ఉంటాయి.
 • కుడిచెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాలా సున్నితమైన వారని అర్థం. అదే ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎప్పుడూ తమ గురించే ఏదో ఆలోచిస్తూ ఉంటారు.
 • ముక్కుపై పుట్టుమచ్చ ఉన్నవారు చిన్న విషయాలకే కోపం వస్తుంది. మళ్ళీ వెంటనే ఆ కోపం తగ్గిపోయి తమ వాళ్ళకు దగ్గరవుతారు.
 • ఛాతీ లేదా రొమ్ము భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలావరకు సోమరితనం కలవారు మరియు తమ జీవితాన్ని విలాసంగా గడపాలని ఆలోచిస్తూ ఉంటారు.
 • కంటి భాగంలో (తెల్లటి పొరపై) పుట్టుమచ్చ ఉన్నవారు: కుడికన్ను శుక్లపటలంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాలా సులభంగా డబ్బు సంపాదిస్తారు, అదే ఎడమకంటి శుక్లపటలంలో మచ్చ ఉన్నవారు అహంకారం కలిగి ఉంటారు.
 • భుజంపై పుట్టుమచ్చ: చాలా అందంగా ఉంటారు. నిజం మాట్లాడతారు, మృదుస్వభావి, తెలివిగా ఆలోచిస్తారు, బాధ్యతగా ఉంటారు.
 • అరచేతులపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే: ఇలా మచ్చ ఉన్నవారు డబ్బు, పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కుడి అరచేతిలో మచ్చ ఉన్నట్లయితే వారు ఆరోగ్యవంతులు. అదే ఎడమచేతి అరచేయిలో పుట్టుమచ్చ ఉన్నవారు ఎలాంటి కష్టం లేకుండా హాయిగా జీవించేస్తారు.
 • పాదాలలో మచ్చ ఉన్నవారు: వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రపంచాన్ని అన్వేషించడానికే వీరి జననం.
 • కనుబొమ్మల కింద మచ్చ ఉన్నవారు: చాలా అందమైన వారు సృజనాత్మక వ్యక్తిత్వం కలిగిన వారు.
 • చెవి కమ్మ భాగంలో: వీరు ఎప్పుడూ కుటుంబం గురించి ఆలోచిస్తూ, కుటుంబమంటే ప్రేమ చూపించే వారు, మరియు విశ్వసనీయమైన వ్యక్తిత్వం కలిగిన వారు.
 • మెడపై మచ్చ ఉన్నవారు: మెడ భాగంలో పుట్టుమచ్చ కలిగి ఉన్నవారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినవారు
 • చేతులపై మచ్చ ఉంటే: ఇలా పుట్టుమచ్చ ఉన్నవారు చేతులలోనే శక్తి ఉంటుంది. ఎలాంటి సమస్య ఎదురైనా మంచి నిర్ణయం తీసుకుంటారు.
 • చేతి వేళ్ళపై పుట్టుమచ్చ ఉన్నవారు: ఇటువంటి వారికి మొదటి నుండీ అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తుంటారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)