మగాళ్ళకు హెచ్చరిక.. ఆధార్ తో జాగ్రత్త ! ఎక్కడ పడితే అక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేయకండి


Loading...

ఆధార్. 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. వ్యక్తిగత గుర్తింపుతో పాటు చిరునామాలకు పనికొస్తుంది. బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ కనెక్షన్ లు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలను పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఈ విషయమే మనకు తెలుసు. కానీ దొంగ భర్తల భరతం పట్టడానికి, రెండో పెళ్లి విషయాన్ని బయటపెట్టేందుకు కూడా ఆధార్ ఉపయోగపడుతుంది అంటే నమ్మగలరా? అవును ఇది నిజమే. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. తన భార్యకు తెలియకుండా, ఇంకో యువతిని వివాహం చేసుకుని, ఇద్దరితోనూ కాపురం చేస్తున్న దొంగ మొగుడి వ్యవహారం ఆధార్ పుణ్యమాని వెలుగుచూసింది.
Loading...

ములకలచెరువుకు చెందిన ఓ యువతి రేషన్ కోసం వెళ్లగా, 5 కిలోల బియ్యం తగ్గాయి. ఈ పాస్ లో తన భర్త పేరు కనిపించకపోవడంతో కోటా తగ్గింది. పేరుంటేనే బియ్యం ఇస్తానని డీలర్ చెబుతుండటంతో, భర్త ఆధార్ నెంబర్ ను ఇంటర్నెట్ కేంద్రంలో ఇచ్చి పరిశీలించగా, అతని పేరు ఇంకో యువతి పేరిట ఉన్న రేషన్ కార్డులో నమోదైనట్టు తెలిసింది. నిబంధనలపరంగా ఒకే ఆధార్ సంఖ్య రెండు రేషన్ కార్డుల్లో ఉండకూడదు కాబట్టి.. ఒక దాంట్లో కొట్టేసి మరో దానిలో నెంబర్ ఉంచారు. దీంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. అసలు నిజం తెలిసి ఆ మహిళ లబోదిబోమంటోంది. డబ్బు సంపాదన కోసం బెంగళూరు వెళ్తానని తన భర్త చెప్పాడని, ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని బావురుమంది.
Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)