"నిమ్మ" లోని ఔషద గుణాలు తెలిస్తే "దిమ్మ" తిరగాల్సిందే..నిమ్మరసాన్ని రోజూ ఏదో రూపంలో తీసుకోగలిగితే

  • ప్రతిరోజూ నిమ్మరసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోగలిగితే రక్త ప్రసరణలో ఎటువంటి లోపాలు ఉండవు. 
  • ప్లూ, జలుబు వంటి వ్యాధులతో బాధపడే సమయంలో ఎటువంటి చికిత్సలు పొందుతున్నప్పటికి వాటికీ జతగా ఉదయం, సాయంత్రం నిమ్మరసాన్ని గోరు వెచ్చని నీటితో కలిపి దాంట్లో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే జ్వరం, జలుబుత్వరగా తగ్గే అవకాశం ఉంది నిమ్మ రక్తాన్ని శుద్ది చేయడంలోను కీలకపాత్రవహిస్తుంది. 
  • నిమ్మపండులో బి.సి. విటమిన్లు ఉన్నందున బాక్టీరియాకు, ఫంగల్‌ ఇన్పెక్షన్స్‌కు వ్యతిరేకంగా పోరాడే రోగనిరోదక శక్తి ని శరీరానికి ఇస్తుంది. కిడ్ని వ్యాధులను సైతం పోగొట్టే శక్తి నిమ్మకు ఉంది. నిమ్మలో పోటాషియం తగినంతమోతాదులో ఉన్నందున గుండెకు సంబంధించిన బాధలు, వ్యాధులను పోగొడుతుంది. 
  • రోజూ నిమ్మరసం తీసుకుంటే అది లివర్‌ టానిక్‌గా ఉపయోగపడుతుంది. కడుపులో మంటతో బాధపడేవారు రాత్రి పడుకో బోయేమందు రోజు నిమ్మరసం తాగినట్లుయితే ఆ బాధ మటుమాయమౌతుంది.
  • డిప్తీరియా, టైపాయిడ్‌ వ్యాధి కారకాలైన సూక్ష్మక్రిములను నశింపజేయడంలో నిమ్మ పరమౌషధంగా పని చేస్తుంది. కామెర్లవ్యాధిని నిమ్మ తగ్గిస్తుంది. దంతక్షయం, చిగుళ్ళవాపు, పుప్పిపళ్శు, ఇంకా చిగుళ్ళకు సంబంధించిన ఏవ్యాధినైనా నిమ్మనయం చేస్తుంది. నోటికి సంబంధించిన వ్యాధులను నిమ్మ పోగొడుతుంది. 
  • అరికాళ్ళ మంటలతోబాధపడేవారు నిమ్మ కాయ చెక్కతో కాళ్ళను బాగా రుద్దినట్లయితే ఫలితం వుంటుంది. ప్రేవులలో వుండే సూక్ష్మక్రిములను నిమ్మ నశింపచేస్తుంది. గ్యాస్‌ను బయటకు పంపి కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. 
  • మలబద్దకం రాకుండా చూడడంలో నిమ్మబాగా తోడ్పడు తుంది గుండె మంట ఉన్నప్పుడు నిమ్మతోడు చాలా అవసరం ఊపిరి తిత్తులు, పొట్ట ప్రేవులు, గర్భసంచి, కిడ్నీలు తదితర అంతర్గత అవయవాలలో సంభవించే రక్తప్రసరణలను నిమ్మ అరికడుతుంది. 
  • రుమాటిజం, కీళ్ళనొప్పులు, ఎసిడిటి, ఇంకా వాత సంబంధమైన సమస్త రోగాలకు నిమ్మ దివ్యఔషదంలా పనిచేస్తుంది. నిమ్మగురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. 
  • ఇప్పటి వరకు తెలుసుకున్న వాటిలో ఎవరికి నచ్చిన విధంగా వారు నిమ్మకాయను వంటింట్లో ఉపయోగించుకుని ఆరోగ్యంపై పట్టు సంపాదించుకోవచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)