ఎక్సర్సైజ్ చేయకుండా వంట్లో కొవ్వు ని కరిగించుకుని స్లిమ్ గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Loading...
అప్పుడప్పుడూ దీర్ఘ శ్వాస తీసుకుని వదలడం అలవాటుగా మార్చుకోండి. దీంతో శరీరంలోని కండరాలు సంకోచించి, వ్యాకోచిస్తాయి. దీనివల్ల క్యాల‌రీలు కరుగుతాయి. ఆఫీసులో ఉన్నా, ఇంట్లో టీవీ చూస్తున్నా సరే వీటిని సులభంగా చేయొచ్చు.

మామూలుగా నిద్రలేచే సమయాన్ని కాస్త ముందుకు జరుపుకుని, ఒక‌ పదిహేను నిమిషాలు ముందే నిద్రలేచేలా చూసుకోండి. ఆ సమయంలో మీ పడక గదిలోనే కాసేపు స్కిప్పింగ్ చేస్తున్నట్టు మెల్లగా దూకండి. శరీరాన్ని ముందుకూ, వెనక్కి వంచండి. దీనివల్ల శరీరంలో అదనంగా చేరిన క్యాల‌రీలు కరుగుతాయి.

అప్పుడప్పుడూ చూయింగ్‌ గమ్‌ని నమలండి. దవడ కండరాలు చక్కగా కదులుతాయి. దీనివల్ల క్యాల‌రీలు ఖర్చు కావడమే కాకుండా మిగతా చిరుతిళ్లు ఎక్కువగా తినే అవకాశం ఉండదు.

మీ వెంట మంచినీళ్ల సీసాను పెట్టుకోండి. నీళ్లు తాగుతూ ఉండండి. ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోవడమే కాదు, శరీరం తేమగా ఉంటుంది. క్యాల‌రీలూ ఖర్చవుతాయి.

టీవీ చూస్తున్నప్పుడు కింద కూర్చోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఏదైనా పనిపడి లేచినప్పుడల్లా శరీరానికి ఎంతో కొంత వ్యాయామం అందినట్లు ఉంటుంది. కూర్చున్నప్పుడు మెడను సాగదీయడం, చేతుల్ని కదిలించడం కూడా చాలా మేలు చేస్తాయి.

లిఫ్ట్ వాడకుండా మెట్లని వాడండి. మెట్లెక్కడం వలన సాధారణ వ్యాయామాలకి 5 రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా లిఫ్ట్ మానేసి మెట్లను వాడండి.

చిన్న చిన్న దూరాలకు కూడా బైక్ లేదా కార్ ని వాడుతున్నారు. అలా కాకుండా నడిచి వెళ్ళడం లేదా సైకిల్ ని వాడడం మంచిది. మీ ఆరోగ్యానికి మంచిది పర్యావరణానికి కూడా మంచిది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...