వేడి వేడిగా టీ, కాఫీలు తాగుతున్నారా ? ఇక్కడే అసలు సమస్య... ఒక్క సారి ఇది చదవండి

మంచినీళ్ల తర్వాత ఎక్కువగా తాగే పానియం టీ, కాఫీలే. చాలా మందికి వీటిని తాగడం ఒక అలవాటు. ఎలాగంటే రోజుకు ఒకసారి రెండుసార్లు కాదు గంటకొకసారి కూడా తాగేవాళ్లుంటారు. అది కూడా వేడి వేడిగా పొగలు రావాలి మరి. ఇక్కడే అసలు సమస్య ఉంది. అతి వేడిగా ఉండే ఎటువంటి ద్రవ పదార్ధమైనా సరే కాన్సర్‌‌కు కారణమయ్యే అవకాశముందట. ఈ మేరకు తాజా వివరాలను తెలియజేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆస్వాదించే విధంగా కొద్దిపాటి వేడిగా ఉంటే సరిపోతుందని మితిమీరిన వేడి పనికిరాదని సూచిస్తున్నారు పరిశోధకులు. వేడి ద్రవం కడుపులోపల చర్మిన్ని కాలుస్తుంది. గొంతు భాగం కాలి అక్కడ ట్యూమర్లు ఏర్పడే అవకాశాన్ని కల్పింస్తుందట. అన్నం, కూర వంటి డైలీ తీసుకునే ఆహార పదార్ధాల విషయంలో కూడా ఇలానే వేడి పనికిరాదా అనే దానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిపారు విశ్లేషకులు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)