నాలుక రంగుని బట్టి శరీరంలో ఏం జరుగుతోందో ఏయే వ్యాదులున్నాయో మొత్తం తెలిసిపోతుంది


Loading...

మానవ శరీర అంతర్భాగాల్లో మిగతా వాటితో సరిసమానమైనది నాలుక. ఇది కేవలం రుచులు తెలుసుకోవడానికే కాదు అది మన ఆరోగ్యాన్ని తెలిపే ఒక కొలమానం కూడా. నాలుక, రంగు, మృదుత్వం, తేమల ద్వారా శరీరం లోలోపల ఏం జరుగుతోందో బయటపెడుతుంది. ఎడతెగకుండా లాలాజలాన్ని పంపడం ద్వారా నోట్లోని బ్యాక్టీరియానంతా బయటకు పంపుతూ నోటిని శుభ్రం చేస్తుంది. సహజంగా లేత పింక్‌ కలర్‌లో, తేమగా, మృదువుగా ఉండే నాలుక ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపే ఒక సూచన. డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు నాలుకను పరిశీలించడం ద్వారా డాక్టర్లు ఎనీమియా నుంచి విటమిన్‌, లవణాల లోపాల దాకా డీ- హైడ్రేషన్‌ నుంచి కిడ్నీ సమస్యల దాకా నాలుకను చూడటం ద్వారానే తెలుసుకుంటారు. వీటితో పాలు రక్త ప్రసరణ స్థాయి, కొలెస్ట్రాల్‌ నిలువలు, అలర్జీలు, జీర్ణాశ య సమస్యలు ఇవన్నీ బయటపడతాయి. నాలుక మీద కనిపించే ప్రధాన లక్షణాలు:

Loading...

నాలుక పాలిపోయి ఉంటే, రక్తంలో హిమోగ్లోబిన్‌ లోపాలు, ఇనుము లోపించిన ప్రొటీన్‌ ఉన్నాయని గ్రహించాలి. ఇవి నీరసం నిస్సత్తువల ద్వారా బయటపడుతూ ఉంటాయి సమతులాహారం తీసుకోవడం ద్వారా ఆ లోపాలను అధిగమించవచ్చు.

నాలుక ఎరుపు రంగులో ఉంటే, అది విటమిన్‌ బి-12, ఫోలిక్‌ యాసిడ్‌ లోపాలు ఉన్నట్టు భావించాలి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల కారణంగా మీకు జ్వరం ఉన్నప్పుడు కూడా నాలుక ఎర్రబడుతుంది.

నాలుక ఊదా రంగులో ఉంటే, శరీరంలో కొలెసా్ట్రల్‌ నిలువలు పెరిగాయని అర్థం.. ఇది రక్త సరఫరా సరిగా లేదని తెలిపే సూచ న కూడా. రక్తప్రసరణ సజావుగా జరగాలంటే వ్యాయామాలు తప్పనిసరి.

Loading...


నలుపు రంగులో ఉంటే శరీరంలో రక్తకణాలు చనిపోయే వేగానికి మించి రక్తకణాల ఉత్పత్తి అధికంగా ఉందనుకోవాలి. అతిగా యాంటీ బయాటిక్స్‌ తీసుకోవడం వల్ల కూడా కొందరిలో ఈ సమస్య తలెత్తవచ్చు. ఇదే కాకుండా పొగతాగడం, అతిగా కాఫీలు తాగడం, దంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు. కొందరి నాలుక మీద బొడిపెలు ఉంటాయి. వీటిని పాపిలే అంటారు. అవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి.

మామూలుగా అయితే చూయింగ్‌, డ్రింకింగ్‌ వల్ల నాలుక మీద పెద్ద ప్రభావం ఉండదు కానీ, కొన్ని సార్లు నాలుక మీదున్న బొడిపెలు పెరుగుతాయి. ఇదే సమయంలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువవుతుంది. నాలుక తన సహజ వర్ణాన్ని కూడా కోల్పోతుంది.

నాలుక మీద అల్సర్లు ఏర్పడితే వ్యాధి నిరోధక శక్తి తగ్గిందనుకోవాలి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లతో సమస్య వచ్చినా అది అంటు వ్యాధి మాత్రం కాదు. చల్లటి పాలు, పెరుగు, నిమ్మ నీళ్లు సేవిస్తే అల్సర్లు వేగంగా త గ్గే అవకాశం ఉంది.
ఏమైనా నాలుక సమస్యలు ఎక్కువ కాలంగా బాధిస్తూ ఉంటే వెంటనే జనరల్‌ ఫిజిషియన్‌ను కలవడం తప్పనిసరి.

    Popular Posts

    Latest Posts