సుప్రీంకోర్టు సంచలన తీర్పు : దుర్మార్గంగా ప్రవర్తించినపుడు దాడి చేయవచ్చునని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చునని సంచలన తీర్పు

Loading...
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు సంచలనం సృష్టిస్తోంది. జనం మేలుకోవాలని చెప్తోంది. దుండగులు దుర్మార్గంగా ప్రవర్తించినపుడు ఆత్మ రక్షణ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చునని స్పష్టం చేస్తోంది. అత్యంత కీలకమైన ఈ తీర్పు ఆత్మరక్షణ హక్కుల హద్దులను విస్తరించింది. ఎవరైనా వ్యక్తి తన తల్లిదండ్రులు, బంధువులు దాడికి గురవుతుండటాన్ని చూసినపుడు వెంటనే దుండగులపై దాడి చేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది.

రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో పొరుగువారిపై దాడి చేశారంటూ ఇద్దరు వ్యక్తులను ట్రయల్ కోర్టు శిక్షించింది. ఆ శిక్షను రాజస్థాన్ హైకోర్టు సమర్థించి, రెండేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిపై సుప్రీంకోర్టులో అపీలు దాఖలైంది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివ కీర్తి సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అపీలును విచారించింది. ట్రయల్ కోర్టు, హైకోర్టు ప్రకటించిన ఇద్దరు నేరస్థులు గ్రామస్థులపై దాడి చేశారన్నది నిజమేనని, అయితే వారిద్దరూ ఇతరులపై ఎందుకు దాడి చేశారన్నది వివరించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపింది. వారి శరీరాలపై అనేక గాయాల గుర్తులు ఎందుకు ఉన్నాయో చెప్పలేదని పేర్కొంది. ఇతరులు తమపై దాడి చేస్తూ ఉంటే ఎదురుదాడి చేసి తమను తాము కాపాడుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ నేరస్థులిద్దర్నీ నిర్దోషులుగా ప్రకటించింది.
Loading...

Popular Posts