ఒట్టి పాదాలతో నడిచే నడక వల్ల కొన్ని 100 రోగాలు తగ్గుతాయి

బయటకు వెళ్లినప్పుడు కాలికి పాదరక్షలు వేసుకోవడంలో తప్పులేదు. కానీ.. మనలో చాలామంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాలికి చెప్పులు లేకుండా అడుగుతీసి అడుగు వేయరు. మన పాదాలతో వంట్లో ఉన్న ప్రతి అవయవానికి సంబంధం ఉంది అందుకనే ఒట్టి పాదాలతో నడిచే నడక వల్ల కొన్ని 100 రోగాలు తగ్గుతాయని ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.. 

మట్టిలో, ఇసుకలో, పచ్చికలో చెప్పులు లేకుండా నడక మన మెదడుని ప్రభావితం చేస్తుంది. అదెలా అంటారా? భూమిలోని ఎలక్ట్రాన్స్‌ శరీరంలో ఉండే యాంటీఆక్సిడెంట్ల సంఖ్యను ప్రభావితం చేస్తాయనేది ఒక అధ్యయనం. కలతలు లేని మంచి నిద్ర పోవాలన్నా... ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా ఒట్టిపాదాల నడక అవసరం. అయితే ఒక్క విషయం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. నేలమీద నడవడం అంటే సిమెంట్‌ నేలపైనో, గ్రానైట్‌రాళ్లపైనో నడవడంకాదు. ప్రకృతికి దగ్గరగా మట్టినేలపై అని అర్థం.

మన శరీరంలోని లిగమెంట్లూ, కండరాలూ, కీళ్లూ శక్తిమంతం అవ్వాలంటే ప్రతి రోజూ కాకపోయినా నిర్ణీత సమయంలో వారానికోసారి కాసేపు నడవడం ముఖ్యం. వయసు మళ్లిన వాళ్లు కూడా వైద్యుల సలహామేరకు ఇంటి తోటలో కాసేపు నడవొచ్చు. చెప్పుల్లేకుండా నడవడం వల్ల వెన్ను మోకాళ్ల బాధల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

కాసేపు పాదరక్షలు లేకుండా నడవడం వల్ల కాలి కండరాలకు ఆక్సిజన్‌ పుష్కలంగా అందుతుంది. అరికాలి మంటలూ, నొప్పులూ ఉన్నవారికి ఇది మంచిది. అయితే విపరీతమైన ఎత్తుపల్లాలుండే చోట నడవడం మాత్రం మంచిది కాదు. కండరాల బలహీనత ఉన్నవారికి కూడా కాలినడక అంత మంచిది కాదు. మధుమేహం వంటివి ఉంటే అసలేవద్దు. అలాగే కొందరికి నేలపై అడుగుపెట్టగానే కొన్ని అలర్జీలు దాడిచేస్తాయి. బహుశా అవి నేలపై ఉండే జిడ్డు, రసాయనాలూ, మురికి కారణంగా కావొచ్చు. అందుకే, పచ్చని పచ్చికపై పాదరక్షలు లేకుండా నడవడం తప్పనిసరి.

Popular Posts

Latest Posts