తులసి ఆకులని ఈ విధంగా జుట్టుకి రాస్తే మీ జుట్టు జీవితంలో ఊడదు...!

ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారింది. జుట్టు రాలడం వయసుతో సంబంధం లేకుండా అందరి లోనూ సమస్యగా తలెత్తింది. ప్రకృతి సిద్దంగా దొరికే తులసి జుట్టు రాలడాన్ని నూటికి నూరు శాతం తగ్గిస్తుంది. ప్రతీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి లో ఉన్న ఔషద గుణాలు జుట్టు రాలడాన్ని అరికడతాయి. జుట్టు రాలడాన్ని మాత్రమే కాకుండా డ్యామేజి అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. తులసిలో విటమిన్ ఏ, సి, ఈ, కె ఉంటాయి. ఇవన్నీ పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేయడంతో పాటు, కుదుళ్లను బలంగా మారుస్తాయి. అలా జుట్టురాలడాన్ని అరికడతాయి. తులసి ఆకుల్లో దాదాపు 3.15 ఏమ్ జీ ప్రొటీన్స్, 6 శాతం నియాసిన్, 40 శాతం ఐరన్ ఉంటాయి. ఇవన్నీ స్కాల్ప్ కి సరిగా బ్లడ్ ఫ్లో అందడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు రెండురెట్లు వేగంగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ చుండ్రుని నివారిస్తాయి. మరి జుట్టు రాలడాన్ని అరికట్టడానికి తులసిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.. 
  • కొంచెం తులసి ఆకులను తీసుకొని శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండిన తరువాత బాగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.
  • 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, 1 టీస్పూన్ తులసి పొడి కలపాలి. ఒక కప్పు నీటిని ఇందులో మిక్స్ చేసి.. పేస్ట్ చేసుకోవాలి. రాత్రంతా నానబెట్టాలి.
  • ఉదయం ఈ పేస్ట్ ను బాగా కలిపి సాఫ్ట్ గా మారిన తరువాత ఒక తీ స్పూన్ ఆలివ్ ఆయిల్, 5 చుక్కల రోజ్ మేరీ ఆయిల్, 5 చుక్కల బాదం నూనె కలపాలి. అన్నింటిని బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి.
  • ఇప్పుడు జుట్టుని చిక్కులు లేకుండా.. దువ్వుకోవాలి. చిన్న చిన్న పాయలుగా విడదీసుకోవాలి. జుట్టు చిట్లిపోకుండా.. నెమ్మదిగా చిక్కు తీసుకోవాలి.
  • ఇలా తయారు చేసుకున్న పేస్టును జుట్టుకు బాగా పట్టించాలి. జుట్టు మొత్తం, స్కాల్ప్ కు ఈ మాస్క్ అందేలా బాగా పట్టించాలి.
  • స్కాల్ప్ ని 5నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇప్పుడు జుట్టుని కట్టుకుని షవర్ క్యాప్ పెట్టుకోవాలి.
  • గంట సేపు ఆ ప్యాక్ ను అలా వదిలేసి కొద్దిగా షాంపూ పెట్టుకోవాలి. తరువాత కండీషనర్ పెట్టుకోవాలి. ఈ ప్యాక్ ను నెలకు రెండు సార్లు వాడితే అధ్బుతమైన ఫలితాలు ఉంటాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)