త్వరగా బరువు తగ్గాలంటే ఆహారం లో మార్పులు చేస్తే చాలు.

తీవ్ర సమస్యగా మారిపోయిన ఊబకాయం వల్ల కలిగే అనర్థాలను గుర్తించిన చాలామంది దాని నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం జిమ్‌లలో గంటల కొద్దీ కష్టపడుతున్నారు. వ్యాయామం కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది కానీ, తీసుకునే ఆహారమే ఒబేసిటీని పారద్రోలడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

  • రోజూ ఉదయం నిద్రలేవగానే నిమ్మకాయ నీళ్లు గానీ, వేడి నేటిలో తేనె గానీ వేసుకుని తాగాలి. ఉదయం సమయంలో శరీరం విడుదల చేసే హానికర ఆమ్లాల నుంచి ఇవి రక్షిస్తాయి.
  •  బ్రేక్‌ఫాస్ట్‌గా రెండు ఎగ్‌వైట్‌ ఆమ్లెట్లు లేదా రెండు స్లైస్‌ల బ్రౌన్‌ బ్రెడ్‌లను కానీ తీసుకోవాలి. అలాగే ఫ్రూట్‌ సలాడ్‌, ఓట్స్‌, ఉప్మా కూడా మంచి బ్రేక్‌ఫాస్ట్‌ పదార్ధాలే.
  • ఇక మధ్యాహ్న భోజనానికి ముందు బ్లాక్‌ కాఫీ తీసుకోవడం మెటబాలిజమ్‌ను మెరుగుపరుస్తుంది.
  • లంచ్‌ సమయంలో చాలా కొద్ది స్థాయిలో ఆహారం తీసుకోవాలి. చపాతీ కాకుండా అన్నం తినాలనుకుంటే బ్రౌన్‌ రైస్‌ తీసుకోవడం ఉత్తమం. అన్నం తక్కువగా కూరలు, పుప్పు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • సాయంత్రం స్నాక్స్‌గా జామ, ద్రాక్ష వంటి సిట్రస్‌ ఫలాలను తీసుకోవాలి. అలాగే ఈ సమయంలో గ్రీన్‌టీ తాగితే మంచిది.
  • నిద్రకు రెండు గంటల ముందు డిన్నర్‌ పూర్తి చేయాలి. చాలా సులభంగా జీర్ణయమ్యే ఆహారం తీసుకోవాలి.
  • ఒకేసారి భారీగా ఆహారం తీసుకోవడం కంటే చాలా తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తినడం మంచిది.
  • కూల్‌ డ్రింక్స్‌ బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగాలి. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి.
  • భోజనానికి, భోజనానికి మధ్య 3 లేదా నాలుగు గంటల కంటే ఎక్కువ గ్యాప్‌ ఉండకూడదు.
  • అన్నిటికంటే ముఖ్యం వేళకు భోజనం చేసేయ్యాలి. భోజనాన్ని మిస్‌ చేయకూడదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)