స్లిమ్ గా, ఫిట్ గా అవ్వాలంటే పెద్ద కష్టమైన పనేమి కాదు.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు

ఈ రోజుల్లో అంతా హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో మరీ కేర్ ఫుల్ గా ఉంటున్నారు. బాడీలో కొవ్వు, కొలెస్ట్రాల్ పెంచే వాటికి దూరంగా ఉంటున్నారు. ఎవరూ లావు పెరగాలని అనుకోవడం లేదు. అంతా సన్నగా, నాజుగ్గా అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. అయితే అందమైన శరీరం పొందడం అంత కష్టమైన పనేమి కాదు. ఆరోగ్యవంతమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే ఎవరైనా తమ శరీరాకృతిని చక్కగా ఉంచుకోవచ్చు. దాని కోసం ఈ టిప్స్ ఫాలో అయితే చాలు….

సరైన వేళకి సరైన ఆహారం తీసుకోవాలి. సమతులాహారం శరీరానికి అవసరం. దీనివల్ల మీరు ఎంతో ఎనర్జిటిక్ గా తయారవుతారు.

వ్యాయామాలు చేసే ముందర ఓట్స్, గుడ్లు లేదా గుప్పెడు బాదంపప్పులు లేదా ప్రొటీన్షేక్ తీసుకోవాలి.

జిమ్ లో వెయిట్స్ ఎత్తడం చాలామంది అమ్మాయిలు చేయరు. అలా చేస్తే తమ శరీరానికి ఎక్కడ హాని కలుగుతుందోనని భయపడుతుంటారు. కానీ వెయిట్స్ ఎత్తడం కూడా శరీర ఫిట్ నెస్ కు ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల కండరాల్లో బలం పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్కవుట్లుని మానేయకూడదు. పుషప్స్, సిటప్స్, వాకింగ్ స్క్వాట్స్ వంటివి చేస్తే శరీరానికి ఎంతో మంచిది.

వర్కవుట్లు చేసే ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత మూడుసార్లు తప్పకుండా నీళ్లు తాగాలి.

ఒత్తిడి నుంచి బయటపడడానికి పండ్లు, కూరగాయలు, చెర్రీలు, బ్రొకొలి వంటివి తరచూ తీసుకోవాలి.

Popular Posts

Latest Posts