తలలో చుండ్రు పోవాలంటే ఇంట్లోనే తయారు చేసుకునే ఆయుర్వేద చిట్కాలు

చుండ్రు రావడానికి కారణాలు అనేకం చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అధిక వత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి వత్తిడికి గురి కావడం సహజం. అలాగే ఎక్కువ సమయం ఎసి గదుల్లో గడపడం వల్ల, తల మీది చర్మం పొడిగా అయిపోయి పొట్టులా లేస్తుంది. షాంపూతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలక పోయినా కూడా చుండ్రు వచ్చే అవకాశం వుంది. చుండ్రు పోవాలంటే ఎప్పుడూ మందులపై అధారపడకూడదు ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని పదార్థాలను ఉపయోగించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ బాధ తగ్గించుకోవచ్చు ఇలా చేయండి మీకు చుండ్రు నుండి ఉపశమనం కలుగుతుంది.
  • తెల్ల మద్ది ఆకు ముద్దగా నూరి తలకు పట్టించి సాన్నం చేస్తే చుండ్రు పోతుంది.
  • మామిడి జీడి పోడి చేసి నీటిలో కలిపి తలకు పట్టించి ఒక గంట ఆగి సాన్నం చేస్తే కొద్ది రోజులకే చుండ్రు పోతుంది.
  • మాడుకి పుదీనా రసం పట్టించి అరగంట తర్వాత తల సాన్నం చేస్తే చుండ్రు సమస్య ఉండదు. 
  • సన్నని మంట పై గసగసాలు కొద్దిగా వేయించి, కొద్దిగా గోరువెచ్చటి నీటి లో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని, తలకు పట్టించి, 1 గంట ఆగి తల స్నానం చేయాలి .
  • చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడిని కలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
  • తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తర్వాత తలస్నానం చేయాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రుకల చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)