ఇంటింటికి బీర్ పైప్ లైన్...ఓకే అంటే ఇంటికే పైప్ లో బీర్... జనాలకు పండగే పండగ

బెల్జియంలోని బ్రుగెస్ నగరంలో ఓ బీర్ కంపెనీ ఉంది దాని పేరు డీ హల్వే మాన్ బ్రేవరీస్..ఓనర్ గ్జావియర్ బెనస్డే. ఇప్పుడు ఈ కంపెనీ పెద్ద మనిషికి అనుకోని కష్టం వచ్చి పడింది. కొంతకాలంగా కంపెనీ తయారు చేసే బీర్ అమ్మకాలు విపరీతంగా తగ్గడంతో దీంతో ఆయనకు ఏం చేయాలో తోచలేదు. అసలు సమస్య ఎక్కడుందా అని పలుసార్లు ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది.

అయితే బ్రుగెస్ నగరానికి 3కీలోమీటర్ల దూరంలో తన బీరు కంపెనీ ఉండటమే అసలు సమస్యగా ఆయన గుర్తించారు. బ్రుగెస్‌‌ను చారిత్రక నగరంగా యునెస్కో గుర్తించింది. దీంతో అక్కడున్న పలు కట్టడాల సంరక్షణ యునెస్కో చూసుకుంటోంది. ఇక కంపెనీ నుంచి బ్రూగెస్ వెళ్లే రోడ్లన్నీ చాలా ఇరుకుగా, వంకరటింకరగా ఉన్నాయి. కొన్ని చాలా కీలక మలుపులు, కాలువలు కూడా ఉండటంతో బీరు బాటిళ్లు తీసుకెళ్లే ట్రక్కులకు ఇబ్బందిగా మారింది. రోడ్లు వెడల్పు చేయాలని అధికారులను కోరినా యునెస్కో అభ్యంతారాలతో గ్జావియర్ దీంతో ఈ పెద్ద మనిషికి ఏం చేయాలో అర్ధం కాలేదు.

ఈ విషయం తెలుసుకున్న ఓ బార్ యజమాని గ్జావియర్‌‌కు ఓ బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. కంపెనీ నుంచి గోడౌన్‌‌కు పైపులైన్ వేసి దాని ద్వారా బీర్ పంపమన్నాడు. ఈ ఐడియా గ్జావియర్ కు నచ్చడంతో బీర్ పైపులైన్ వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పైపులైన్ నిర్మాణం కోసం దాదాపు 31 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
Loading...

Latest Posts