ఒక లీటర్ కోకా కోల తయారీకి 9 లీటర్ల నీళ్లు వృధా ఇంకా దారుణమైన నిజాలు.. షేర్ చేయండి

కోకాలకోలా ఫ్యాక్టరీల వల్ల ఊర్లకు ఊర్లే నీటి కొరతతో అలమటిస్తున్నాయట. ఓ గ్రామం కోకాకోలా కంపెనీ ఉంటే ఆ గ్రామంలోని గ్రౌండ్ వాటర్ లో సగానికి పైగా ఆ కంపెనీ తన బేవరేజెస్ కోసం వినియోగిస్తుందట! దీంతో ఆ కంపెనీ ఉన్న గ్రామాలు తీవ్ర వాటర్ ప్రాబ్లమ్ ను ఎదుర్కోవాల్సి వస్తుందట.! ప్రముఖ పర్యావరణవేత్త వందన శివ ఆరోపణల మేరకు….ఒక లీటర్ కోక్ తయారీకి దాదాపు 9 లీటర్ల నీటిని వృధా చేస్తారు. దీని కారణంగా సదరు గ్రామ గ్రౌండ్ వాటర్ లెవల్ తగ్గి తీవ్ర నీటి సమస్య ఏర్పడుతుంది. 
దీనికి ఈ కింద సంఘటనలే ఉదాహరణలు:
  • రాజ‌స్థాన్‌లోని క‌ల‌దెరా అనే ప్రాంతంలో 1999లో కోకాకోలా త‌న ప్లాంట్‌ను ప్రారంభించింది. అయితే అప్ప‌టికే ఆ గ్రామంలో నీటి వ‌న‌రులు అర‌కొర‌గా ఉండేవి. ప్లాంట్ పెట్టాక అవి మ‌రింత తగ్గిపోవ‌డంతో స్థానికుల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అనంత‌రం 5 ఏళ్ల‌కు ఆ గ్రామంలో భూగ‌ర్భ జ‌ల‌వ‌న‌రులు 10 మీట‌ర్ల లోతుకు ప‌డిపోయాయి. దీంతో స్థానికుల విన్న‌పం మేర‌కు ఆ ప్లాంట్‌ను ప్ర‌భుత్వం మూసేయించింది.
  • కేర‌ళ‌లో మార్చి 2000వ సంవ‌త్స‌రంలో ప్ల‌చిమ‌ద అనే ప్రాంతంలో కోకాకోలా ఓ ప్లాంట్‌ను నెల‌కొల్పింది. అయితే ఆ ప్లాంట్ నుంచి వ్య‌ర్థాలు పెద్ద ఎత్తున విడుద‌లై భూగ‌ర్భ జ‌ల వ‌న‌రులు క‌లుషిత‌మ‌వడం, నీటి వ‌న‌రులు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం ప్లాంట్‌ను మూసివేసేలా చేసింది.
  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మెహ్‌దీ గంజ్ అనే ప్రాంతంలో కూల్‌డ్రింక్ ప్లాంట్‌ను కోకాకోలా ఏర్పాటు చేయ‌గా అక్క‌డ కూడా పైన చెప్పిన విధంగానే స్థానికుల‌కు క‌ష్టాలు ఎదుర‌య్యాయి. కోకాకోలా కంపెనీ పెద్ద ఎత్తున నీటిని వాడుకుంటుండ‌డంతో స్థానికంగా భూగ‌ర్భ జ‌లాలు అడుగంటిపోయి అక్క‌డి ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తాగునీరు, సాగునీరు లేదు. దీంతో ఆ ప్లాంట్‌ను అక్క‌డి ప్ర‌భుత్వం 2013లో మూసివేయించింది.
  • ఇంకా ఉత్త‌రాఖండ్‌, త‌మిళ‌నాడు, వార‌ణాసి వంటి ప్రాంతాల్లోనూ కోకాకోలా కంపెనీ అక్ర‌మంగా నీటిని తోడుతుంద‌నే స‌మాచారం రావ‌డంతో అక్క‌డి ప్లాంట్లను ఈ మ‌ధ్య కాలంలో మూసివేయించారు.
  • ఈ లెక్కల ప్రకారం చూస్తే…కోకాకోలా రోజూ తమ త‌మ ప్లాంట్ల‌లో ఎన్ని లీట‌ర్ల కూల్ డ్రింక్‌ల‌ను త‌యారు చేస్తున్నారో, ఎంత నీరు అక్ర‌మంగా భూగ‌ర్భం నుంచి తోడుతున్నారో మ‌నం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. సహజ వనరులలో అత్యంత విలువైనది మంచినీరు…దీనిని ఈ విధంగా ఖర్చు చేయడానికి మనమూ ప్రత్యక్షంగా కారణమవుతున్నాం……కూల్ డ్రింక్స్ తాగితే వచ్చే రోగాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ….రేపటి తరానికి నీటిని అందించేందుకైనా కూల్ డ్రింక్స్ కు టాటా చెప్పేద్దాం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)