ఈ అలవాట్ల వలన డయాబెటిస్ ( షుగర్ వ్యాధి ) వస్తుంది. ఆ అలవాట్లు ఏంటో ఒక్కసారి గమనించండి

ఈ డయాబెటిస్ అనే పదం ఎన్నో జీవితాల్ని వణికిస్తోంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో వచ్చే ఈ జబ్బు, రోజురోజుకి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ప్రాణానికి ముప్పుగా మారుతుంది. ఇది వంశపారంపర్యంగా కూడా రావొచ్చు. అలా కాకుండా మనిషికి ఉన్న కొన్ని అలవాట్ల వలన కూడా డయాబెటిస్ వస్తుంది. ఆ అలవాట్లు ఏంటో ఒక్కసారి గమనించండి.
  • షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే సోడా, సాఫ్ట్ డ్రింక్స్ తరచుగా తాగడం వలన డయాబెటిస్ వస్తుంది. అలాగే కెఫైన్ లభించే కాఫీ ఎక్కువగా తాగడం వలన కూడా మధుమేహం మెల్లిగా శరీరంలోకి చేరుతుంది.
  • అమ్మాయిలు కండోమ్ కి బదులు, గర్భనిరోధక మాత్రలపై మక్కువ చూపితే, అది వారికే నష్టం. వాటి వలన కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
  • డ్రై ఫ్రూట్స్ రోజూ తింటే మంచిదే. కాని లిమిట్ తప్పి డ్రై ఫ్రూట్స్ తిన్నా ప్రమాదమే. ఎక్కువ మోతాదులో డ్రై ఫ్రూట్స్ శరీరంలోకి చేరితే కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.
  • పిజ్జా, ఫ్రై వంటకాలు, బర్గర్స్, చాకోలేట్స్ లో కాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
  • కొన్ని రకాల మెడికల్ మందులు కూడా ఎక్కువగా వాడితే మధుమేహం వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
  • ఇక చివరగా, అతిముఖ్యమైనది. తీపి వస్తువులు రెగ్యులర్ గా తిన్నారంటే, మీ శరీరాన్ని మీరే చంపుతున్నట్లు.

Latest Posts