మీ స్మార్ట్ ఫోన్ పదేపదే హ్యాంగ్ అవుతుందా ? మీ ఫోన్‌ ఉన్నన్ని రోజులూ స్మార్ట్‌గా, ఫాస్ట్‌గా పనిచేయాలంటే ఈ సూత్రాలు పాటించండి.

వేలకు వేలు వెచ్చించి కొన్నదైనా.. నయా ఫీచర్స్‌ ఉన్నదైనా.. సరికొత్త యాంటీవైరస్‌ ఇన్‌స్టాల్‌ చేసిందైనా.. ఏ స్మార్ట్‌ ఫోన్‌ అయినా.. కొంత కాలానికి వేగంలో నెమ్మదిస్తుంది. చూపుడు వేలుకు పని ఎక్కువ చేస్తుంది.. తరచూ హ్యాంగ్‌ అవుతూ విసుగు తెప్పిస్తుంది. మీ ఫోన్‌ ఉన్నన్ని రోజులూ స్మార్ట్‌గా, ఫాస్ట్‌గా పనిచేయాలంటే ఈ సూత్రాలు పాటించండి.
  • యాప్‌లంటే అందరికీ ఇష్టమే. ఇందులో మన అవసరాలను తేలిక చేసేవి కొన్నయితే.. కాలక్షేపానికి అప్‌లోడ్‌ చేసుకున్నవి ఇంకొన్ని. అయితే అక్కరకు రాని చుట్టం ఎలాగైతే భారమని భావిస్తామో.. అవసరం లేని యాప్‌లు కూడా ఫోన్‌కు భారమే. అప్పుడప్పుడూ చూసేవే అయినా.. సదరు అప్లికేషన్లు ఫోన్‌లో ఎక్కువ మెమొరీని కబ్జా చేస్తాయి. అంతేకాదు ప్రాసెసర్‌ మీద కూడా పెత్తనం చెలాయిస్తాయి. వెరసి మీ ఫోన్‌ను బద్ధకించేలా చేస్తాయి. అందుకే అవసరం లేని యాప్‌లను వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేసేయండి.
  • ప్లేస్టోర్‌ నుంచి కాకుండా వేరే సోర్స్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసుకునే యాప్‌లలో వైరస్‌ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకే థర్డ్‌ పార్టీ నుంచి యాప్స్‌ షేర్‌ చేసుకోవడం మానేయండి.
  • ఫోన్‌లోని రామ్‌ (రాండమ్‌ యాక్సెస్‌ మెమొరీ)లోని అడపాదడడా క్లియర్‌ చేస్తూ ఉండాలి. మల్టీ టాస్కింగ్‌ వల్ల రామ్‌పై ఒత్తిడి పెంచుతుంది. ఫోన్‌ వేగంపై ఎక్కువ ప్రభావం చూపే ఈ మెమొరీ యూనిట్‌ను యాక్టివ్‌గా ఉంచుతుండాలి.
  • యాప్‌ అప్‌డేట్స్‌ విషయంలో పక్కాగా ఉండాలి. ఆటోమెటిక్‌గా కాకుండా మాన్యువల్‌గా అప్‌డేట్‌ అయ్యేలా చూసుకోండి. అది కూడా అవసరం అయితేనే అప్‌డేట్‌ చేయండి. అలా కాకుండా తరచూ ఆప్‌డేట్‌ చేస్తూ ఉండటం వల్ల ఆ అప్లికేషన్స్‌ అదనపు స్పేస్‌ తీసుకుంటాయి.
  • సాధ్యమైనంత వరకు మైక్రోఎస్‌డి మెమొరీకార్డ్‌లకు దూరంగా ఉండండి. (అంటే ఇన్ బిల్ట్ మెమరీ ఎక్కువగా ఉండే మొబైల్ మంచిదని). మెమొరీ కార్డుతో స్పేస్‌ ఎక్కువగా లభించినా.. దీని వల్ల ఫోన్‌వేగం తగ్గుతుంది.
  • ఫైల్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో అలసత్వం విడనాడాలి. గ్యాలరీలో కుప్పలు తెప్పలుగా ఫొటోలు, వీడియోలు వచ్చి చేరుతున్నా.. పట్టించుకోకపోతే, మీ ఫోన్‌ వేగం సన్నగిల్లుతుంది. ఎప్పటికప్పుడు గ్యాలరీని శుభ్రం చేస్తూ ఉండండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)