టవల్స్ విషయం లో చాలా జాగ్రత్తగా ఉండండి. రోగాలు మన వాడుతున్న టవల్ తోనే వస్తాయి

మనం ఉపయోగించే టవల్ అనేక సూక్ష్మ జీవులకి పర్మనెంట్ ఇల్లు. టవల్ తడిగా ఉండడం వల్ల, క్రిములు బాగా వృద్ధి చెందుతాయి. సిటీల్లో అయితే టవల్ ఎండలో ఆరవేసుకునే సౌలభ్యం చాలా మందికి ఉండదు. అందుకే బాల్కనీ లో గాలికి ఆరవేస్తారు. దీనివల్ల టవల్ లో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందట. మన శరీరాన్ని తుడుచుకునేతప్పుడు, మన శరీరం పై ఉన్న మృతకణాలు టవల్ కి అంటుకుంటాయి. టవల్ కి అలా అంటుకున్న మృత కణాలు, సూక్ష్మజీవులకి ఆహారంగా పనికొస్తాయి. ఏసీ లో ఉన్నట్లు చల్లని టవల్ లో ఉంటూ, మృత కణాలని ఆహారంగా తీసుకుంటూ, టవల్స్ లో సూక్ష్మ క్రిములు కాపురం పెట్టేస్తాయట. ఎవరి టవల్ వారు ఉపయోగించుకుంటే ఈ సూక్ష్మ క్రిముల వల్ల పెద్ద ప్రమాదం ఉండదు కాని, ఒకరి టవల్ ఒకరు వాడితే మాత్రం జబ్బులు గ్యారంటీ అంటున్నారు వైద్యులు.

టవల్స్ లో ఉండే స్టాఫిలోకోకస్ బాక్టీరియా వల్ల మొటిమలు, పొక్కులు, దద్దుర్లు వంటి చర్మ వ్యాధులు వ్యాప్తి చెందుతాయట. అందుకే ఇక నుండి ఒకరి టవల్ ఇంకొకరు వాడకండి. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే, టవల్స్ విషయం లో మరింత జాగ్రత్త అవసరం. పొరపాటున కూడా పెద్దలు తుడుచుకున్న టవల్స్ ని పిల్లలకి ఉపయోగించకండి. పిల్లలు సున్నితంగా ఉంటారు కాబట్టి రిస్క్ ఎక్కువ. మూడు రోజుల కొకసారి టవల్స్ సబ్బుతో ఉతికి ఎండలో ఆరబెట్టండి. అలా వీలుకాకపోతే, ఒక మూత, ఏ డెటాల్ లాంటి యాంటి సెప్టిక్ లోషన్ లోనో టవల్స్ నానబెట్టి ఉతికి ఉపయోగించుకోండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)