గ్యాస్ ఆదాకు మంచి చిట్కాలు.. ఈ చిట్కాలు పాటిస్తే గ్యాస్‌ ఎక్కువ కాలం వస్తుంది

తరిగిపోతున్న సహజ వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. విద్యుత్‌, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ వంటివి సహజవనరుల కిందకు వస్తాయి. వీటిలో మనం నిత్యం వాడేదాంట్లో వంటగ్యాస్‌ ముఖ్యమైంది. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే కొంత మేర గ్యాస్‌ ఆదా చేయవచ్చు. దీంతో అటు సహజవనరులను పరిరక్షించడంతోపాటు ఆర్ధికంగా కూడా లాభం చేకూరుతుంది.

  • పొయ్యి వెలిగించే ముందు వంటకు కావలసిన వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి.
  • వంట చేసేటప్పుడు వండుతున్న పాత్రలపై మూత పెట్టడం మరువద్దు.
  • ప్రెషర్‌ కుక్కర్‌ వినియోగిస్తే మేలు.
  • ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వెంటనే పొయ్యిపై ఉపయోగించకూడదు.
  • పప్పు దినుసులు, బియ్యం వంటకు ముందే నానబెట్టుకుంటే మంచిది.
  • వండే పాత్ర అడుగుభాగం వెడల్పుగా ఉంటే మంచిది.
  • తరుచూ స్టైవ్‌ బర్నర్‌ను శుభ్రం చేయించాలి.
  • బీటలు వారిన పైపును వాడొద్దు.
  • గాలి వీచే ప్రాంతంలో వంట చేయకూడదు.
  • వంట పూర్తయ్యేవరకు పొయ్యి దగ్గరే ఉండడం మంచిది. పొంగు బర్నర్‌పై పడకుండా చూసుకోవాలి.
జాగ్రత్తలు పాటించాలి
గ్యాస్‌ సిలిండర్‌ వాడటంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. స్టౌ పైపులు నాణ్యమైనవి వాడాలి. తరుచూ స్టౌవ్‌ను, బర్నర్‌ను శుభ్రపరుస్తూ ఉండాలి. సిలిండర్‌కంటే కొంచెం ఎత్తులో పొయ్యిని ఏర్పాటు చేసుకోవాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)