అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు ? ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం

 • అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు? మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఝానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు, మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది ‘ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోనని వానికి ఏ కోరికలు ఉండవు' అని చెబుతుంది భగవద్గీత.
 • మనకి తెలుసు - మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్సవసరమని, ఈ శరీరము ఆహరముచే ఏర్పడుచున్నదని. దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారమును వారికి ఏర్పరిచెను.
 • దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషధీ: | దైత్యరక్షః పిశాచాదేర్దత్తం మద్యామిషాది చ ||
 • బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకును ఋషులకును అన్నము సస్యములు అనగా ఫలమూలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహరములుగా సృష్టించెను.
 • మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై మేదస్సు మొదలగు సప్తధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే శుద్ధఆహారం తప్పనిసరి.
 • అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి నమస్కరించి తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు నిందింపకూడదు. ప్రశాంత వాతావరణంలో ఆహారం తీసుకోవాలి. ఎంగిలి ఎవరికీ పెట్టకూడదు. అమిత భోజనం ఆరోగ్యభంగాన్ని కలిగిస్తుంది.
 • ఎంగిలి చేత్తో బ్రాహ్మణుని, ఆవును, అగ్నిని తాకరాదు. తలకు గుడ్డచుట్టుకుని, చెప్పులు, బూట్లు వేసుకుని భుజించరాదు. దక్షిణం వైపు తిరిగి భుజించకూడదు. తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. మంచంపైన కూర్చుని ఏవీ తినకూడదు. ఏ వస్తువునైనా ఒడిలో పెట్టుకుని తినరాదు.
 • భోజనం ఆకుల్లో పెట్టడమే మంచిది. అది ఆరోగ్యప్రదం. ప్లేట్లు ఉపయోగించడం వల్ల జబ్బులు వ్యాపించే అవకాశం ఉంది. ప్రాతస్సాయం సంధ్యా సమయాల్లో చేసే ఉపాసన సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి "న సంధ్యయోర్నమధ్యాహ్నే నార్థరాత్రే కదాచన" సంధిసమయాల్లో, అర్థరాత్రిలో భుజింపరాదు. అర్థరాత్రి సూర్యసంబంధం బొత్తిగా లేనందున ఆకలి మందగించి ఉంటుంది. కాబట్టి అర్థరాత్రి భోజనం నిషేధమని పండితులు అంటున్నారు.
 • నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు.
 • అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తేఅద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి.
 • ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి.
 • బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు.
 • భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)