ఇంటిని శుభ్రం చేసుకోవడంలో చాలా ఉపయోగపడే…8 చిట్కాలు.!

  • ఇంటి పనులు ఎంత చేసినా ఏదో ఒక పని పెండింగ్ ఉంటూనే ఉంటుంది.జాబ్ చేసే గృహిణులకైతే అది మరీ కష్టతరం.ఇక ఇళ్లు క్లీనింగ్ అనేది పెట్టుకుంటే చాలా సమయం దానికే సరిపోతుంది.అలాకాకుండా కొన్ని కష్టమైన పనులు సమయం వృదా కాకుండా చాలా ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాం.
  • షవర్ లో చేరిన డస్ట్ ను క్లీన్ చేయాలంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానిలో కొంచెం వెనిగర్ వేసి ఆ కవర్ ని షవర్ కి కట్టి , 2నుండి 3 గంటల తర్వాత కవర్ తీసి చూడండి… షవర్ లో ఉన్న డస్ట్ అంతా పోతుంది.
  • కేవలం 20నిమిషాలపాటు మీ పాత బ్రష్ ను వెనిగర్ లో ఉంచినట్టయితే, మీ కొత్త టూత్ బ్రష్ రెడీ.
  • స్టీల్ డబ్బాపై దుమ్ము పట్టి తోమడానికి కష్టం గా ఉన్నట్టయితే దానిపై టార్టర్ క్రీం అప్లై చేసి స్క్రబ్ చేసి చూడండి. దీనివల్ల టైం సేఫ్ ,తళతళ మెరిసే పాత్రలు మీ సొంతం.
  • మిక్సీ జార్ తోమడం ఇబ్బందిగా ఉంటే వేడినీళ్లు తో నింపి, కొంచెం సబ్బు వేసి దాన్ని కాసేపు అలాగే వదిలేసి, కడగేయండి.
  • టైల్స్ పై మురికి ని తొలగించాలంటే బేకింగ్ సోడా మరియు బ్లీచింగ్ పౌడర్ మిశ్రమాన్ని టైల్స్ పై అప్లై చేసి కాసేపయ్యాక స్పాంజ్ తో తుడిచి చూడండి.
  • మైక్రోవేవ్ ఒవేన్ ని క్లీన్ చేయలాంటే ఒక కప్పు వాటర్ లో నిమ్మ చుక్కలు పిండి ఆ కప్ ని ఒవెన్ లో పెట్టండి. ఇప్పుడు ఒవేన్ ని ఆన్ చేసి రెండు నిమిషాలు హైలో ఉంచండి. తర్వాత ఆప్ చేసి ఆవిరి పట్టిన వాటర్ ని క్లాత్ తో తుడిచేస్తే సరి.
  • పరుపు నీట్ గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లే.చాలామంది ఎండలో ఉంచి దాన్ని తీసేస్తారు.అలా కాకుండా కొంచెం బేకింగ్ సోడా చల్లి, కాసేపయ్యక పరుపు ను దులపండి.
  • తలుపులు, ఫర్నీచర్ నీట్ గా మెరవాలంటే దాని కోసం ఇంట్లోనే పాలిష్ తయారు చేసుకోవచ్చు.కొంచెం వెజిటబుల్ ఆయిల్ లో బేకింగ్ సోడా కలిపి దానిని తలుపులు, ఫర్నీచర్ పై అప్లై చేసి తుడిచేస్తే మరకలు పోతాయి.
  • కార్పెట్ పై పై మరకలు పోగొట్టాలంటేఒక క్లాత్ ని కొంచెం తడి చేసి దానిపై కొంచెం వేడిగా ఉన్నఇస్త్రీ పెట్టెని ఉంచండి.మరక మాయం అవుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)