మధ్యాహ్నం పడుకోవడం శరీరానికి, మెదడుకు చాలా మంచిది. మీలో క్రియేటివిటీ పెరగాలంటే మధ్యాహ్నం నిద్రపోవడం తప్పనిసరి

  • రాత్రి ఎంత గాఢంగా నిద్రపోయినా కొందరికి పగలు కునుకు తీయడం అలవాటు. సమయం దొరికితే చాలు... నిద్రలో జారుకుంటారు. మిట్ట మధ్యాహ్నం కాసేపు నిద్రపోవడం చాలా మందికి అలవాటు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు శాస్త్రవేత్తలు.
  • మనలో చాలామంది మధ్యాహ్నం భోజనం తర్వాత గానీ తీరిక దొరికినప్పుడు గానీ కొద్దిసేపు కునుకు తీయటం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కాసేపు నిద్రపోవటం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల మోతాదులు తగ్గుతున్నట్టు వెల్లడైంది. అప్పుడప్పుడు నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి చేకూరుతుంది. దీంతో శరీరం పునరుత్తేజితమవుతుంది. పైగా ఇలా కునుకు తీసుకునే వారికి మానసిక, శారీరక ఒత్తిడి దరి చేరవంటున్నారు పరిశోధకులు. సమయం, సందర్భం అనుకోకుండా అప్పుడప్పుడు చిన్న కునుకు తీస్తుంటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. 
  • కాసేపు పడుకుని లేవడం వల్ల శరీరానికి అలసట తీరుతుంది. మొదడు చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా మరింత సమర్థంగా, సృజనాత్మకంగా పని చేయొచ్చు. 
  • పగలు కాసేపు పడుకోవడం టైమ్‌ వేస్ట్‌ చేయడమనుకుంటే పొరపాటే. కళ్లకు కాసింత విశ్రాంతి ఇచ్చేందుకు మంచి మార్గమిది. 
  • గుండె పనితీరు మెరుగయ్యేందుకు, హార్మోన్ల హెచ్చుతగ్గులను సమం చేసేందుకు, రక్తనాళాలు శుభ్రపరిచేందుకు పగటి నిద్ర ఉపకరిస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే ఒత్తిడిని దీని ద్వారా తగ్గించుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో 20-30 నిమిషాలు నిద్రపోవడం వల్ల ఆ తర్వాత చేసే పనిలో ఉత్సాహం నిండుతుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మగవారితో పోలిస్తే ఆడవారిలో మధ్యాహ్నం నిద్రవల్ల కలిగే లాభాలు కాస్త తక్కువే.
  • మధ్యాహ్నం భోజనం మితిమీరి తినడం వల్ల నిద్రముంచుకొస్తుందని అనుకుంటారు చాలా మంది. ఇది నిజం కాదని తేల్చారు శాస్త్రవేత్తలు. భోజనం చేయకున్నా మధ్యాహ్నం నిద్రవల్ల కలిగే లాభాల్లో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పారు. పైగా దీనివల్ల అలర్ట్‌గా ఉండే శక్తి, ప్రొడక్టివిటీ పెరుగుతుందట. 
  • క్లిష్ట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరిగేందుకు పగలు నిద్ర ఉపకరిస్తుంది. మెదడుకు రిఫ్రెష్‌నెస్‌ను కలిగించేది ఇదే. పగలు కాస్త కునుకు తీసిన తర్వాత ఏదైనా పనిని మొదలు పెడితే అది మరింత సమర్థంగా ఉంటుంది. 
  • అలసటను తీర్చే నిద్రవల్ల ముఖంలో కాంతి పెరుగుతుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖంలోని రక్త కణాలు నిద్రించే సమయంలో యాక్టివ్‌గా పనిచేయడమే ఇందుకు కారణం. పగలు ఓ అరగంట ప్రశాంతంగా నిద్రపోగలిగితే ఎన్ని ఉపయోగాలో. ఆరోగ్యం, అందం, విశ్రాంతి అన్నీ ఒక్కసారిగా దొరుకుతాయి.
  • ఇదంతా చదివి అన్నీ లాభాలే ఉన్నాయని అతిగా నిద్రపోకండి. మూడు, నాలుగు గంటలపాటు నిద్రపోతే మీకు షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. అలాగే, స్థూలకాయంతో బాధపడేవారు, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేవారు ఈ మధ్యాహ్నం నిద్రకి దూరంగా ఉంటేనే మంచిది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)