మీ ఫోన్ లొ మెమరికార్డు సడెన్‌గా పనిచెయ్యట్లెదా ముఖ్యమైన ఫొటోలన్నీ డిలీట్ అయ్యాయా.. ?

సెక్యూర్ డిజిటల్.... ఈ పేరు వినడానికి కొత్తగా ఉన్నా.. మీరు దీన్ని రోజు వాడుతూనే ఉంటారు. అవునండి సెక్యూర్ డిజిటల్ అంటే ఎస్డీ కార్డు (SD card) అని అర్ధం. ఈ ఎస్డీ కార్డు ఫోన్, కెమెరా, Mp3 ప్లేయర్ లాంటివి వాడుతున్న ప్రతీ ఒక్కరికి సుపరిచితమే. కేవలం ఫోన్స్ లోనే కాకుండా డిజిటల్ కెమెరాలలో, Mp3 ప్లేయర్ లలో ఇలా ఎన్నో వాటిలో ఎస్డీ కార్డ్లను వాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఈ ఎస్డీ కార్డులు పాడవుతూ ఉంటాయి. సరిగ్గా పని చేయకపోవడం, అందులో ఖాళి ఉన్న.. ఫైల్స్ కాపీ అవ్వకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలాంటి సమయాల్లో ఎం చెయ్యాలి అనే విషయాలు తెలుసుకుందాం!!
ఎస్డీ కార్డు ఫెయిల్ అవటానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ఎక్కువ శాతం యూజర్ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసేుకునేవే. కొన్ని సందర్భాల్లో ఎస్డీ కార్డు ఫుల్‌గా ఉన్నప్పటికి బ్లాంక్ అని చూపిస్తుంటాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం తప్పుడు ఫార్మాట్ (Wrong Format). ఒకే కార్డును వేరు వేరు డివైసుల్లో వాడటం వల్ల, ఈ సమస్యలు ఎదురవుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక్కో డివైస్ కు ఒక్కో కార్డు వాడటం మంచిది.
కొన్ని సందర్భాల్లో కంప్యూటర్ కు కనెక్ట్ అయివున్న కార్డును సరైన పద్ధతిలో (Safely Remove) డిస్-కనెక్ట్ చేయకపోతే ఎస్డీ కార్డు క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే కెమెరాల్లో కాని, ఇతర డివైస్ లలో కాని ఎజేక్ట్ (Eject) ఆప్షన్ తప్పనిసరిగా ఎంచుకోవాలి.
కొంత మంది ఎస్డీ కార్డులను రఫ్‌ గా హ్యాండిల్ చేసేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కార్డులు ఫిజికల్‌ గా డామేజ్ అవుతుంటాయి. మీ కార్డ్ రీడర్ స్లోగా ఉన్నా, మెమెరీ కార్డ్ తీసుకోవటం ఆలస్యమవుతుంది. కాబట్టి లేటెస్ట్ వర్షన్‌ కార్డ్ రీడర్ వాడితే మంచిది. మీరు వాడుతోన్న ఎస్డీ కార్డు కూడా పాత వర్షన్‌ ది అయినట్లయితే రైటింగ్ స్పీడ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి, మీ కార్డును కూడా లేటెస్ట్ వర్షన్‌ కు అప్‌-గ్రేడ్ చేసుకోవటం మంచిది.

సడన్ గా పని చెయ్యడం మానేసిన మెమరీ కార్డు లోని డేటా ను రికవరీ చెయ్యడానికి సర్వీస్ సెంటర్లకు తెసుకువెళ్తే వాళ్ళు మన దగ్గర నుండి డబ్బును వసూలు చేస్తారు. అలా కాకుండా మనమే సొంతంగా కొన్ని టూల్స్ ఉపయోగించి పాడైపోయిన మెమరీ కార్డులోని డేటాను తిరిగి పొందవచ్చు.
ఇప్పుడు మనం కొన్ని రికవరీ సాఫ్ట్ వేర్స్ గురించి తెలుసుకుందాం.
1. Data Recovey Software
2. Card Recovery Pro
3. PhotoRec
4. Recover My Files
5. Wonder Share recovery tool
Android ఫోన్లు మరియు టాబ్లెట్లలో డేటా రికవరీ సాఫ్ట్వేర్
మీరు మీ Android పరికరం నుండి తొలగించిన ఫైళ్లను, ఫోటోలు, వీడియోలు లేదా పరిచయాలను తిరిగి కావాలంటే, ఈ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రోగ్రామ్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆండ్రాయిడ్ Wondershare డాక్టర్ డేటా రికవరీ Fone. దీని ద్వారా మనం పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందవచ్చు.
ముందుగా wonder share data recovery tool ను ఓపెన్ చెయ్యాలి. అందులో మనకి నాలుగు options కనిపిస్తాయి.
1. Last file recovery
2. partition recovery
3. Raw file recovery
4. resume recovery
మీరు Raw file recovery option ను ఎంచుకోండి.
తరువాతి window లో మీకు రకరకాల file types చూపిస్తుంది. mp3, video, pictures all type files అనే options చూపిస్తాయి.

తరువాతి స్టెప్ లో మీరు ఏ location లో అయితే ఫైల్స్ డిలీట్ అయ్యయో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి.

ఇప్పుడు మీకు రెండు ఒప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో deep scan మోడ్ సెలెక్ట్ చెయ్యండి.
1. deep scan mode
2. ENable raw file recovery

ఇప్పుడు మీరు పోగొట్టుకున్న ఫైల్స్ మొత్తం కనిపిస్తాయి. కింద రికవరీ అనే option మీద క్లిక్ చేస్తే చాలు. మీ ఫైల్స్ మొత్తం రికవరీ అవుతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)