బాగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి అంటున్నారు అమ్మాయిలు కానీ పెళ్ళి లేట్ అయితే గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు

Loading...
''నాకిప్పుడే పెళ్ళొద్దు... ఇంకా చదువుకోవాలి... చాలా ప్లానింగ్‌ ఉంది... బాగా సంపాదించాక అప్పుడే పెళ్ళి'' అంటున్నారు ఈ కాలం అమ్మాయిలు. పెళ్ళి, పిల్లలు కంటే ముందు ఆర్థికంగా సెటిల్‌ కావాలని... ఆ తర్వాతే అన్నీ అని భావిస్తున్నారు. ఈ ఆలోచన మంచిదే కానీ, ఇదే లైఫ్‌ ప్లానింగ్‌ కాదంటున్నారు వైద్య నిపుణులు. పెళ్ళి, పిల్లల్ని కనడం కూడా ప్లానింగ్‌లో భాగమేనని గుర్తించాలంటున్నారు.

పిల్లలు కనడానికి అనువైన వయసు 18 నుంచి 24 సంవత్సరాలని సూచిస్తున్నారు. పెళ్ళి ఆలస్యం అయ్యేకొద్దీ గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయట. 25 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భం దాల్చే అవకాశం తక్కువ.
ఒక సర్వే ప్రకారం 
  • 25 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసు గల వివాహితకు గర్భం దాల్చే అవకాశం 26 శాతానికి పడిపోతుంది. 
  • 31 నుంచి 35 సంవత్సారాల లోపు వారికి 38 శాతానికి పడిపోతుంది. 
  • 18 నుంచి 24 ఏళ్ళ లోపు వివాహితులకు పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా, మంచి బరువుతో పుడతారు. అందుకే పెళ్ళికి తొందర పడాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.
Loading...

Popular Posts