మనకు దొరికే ఆకుకూరల్లో అన్నింటి కంటే ఈ పొన్నగంటి కూర చాలా ఉత్తమమైనది.. బరువు పెరగాలన్న బరువు తగ్గాలన్న ఈ ఆకుతోనే సాధ్యం

Loading...
రక్తాన్ని శుద్ధి చేయడానికి మనకు ఎంతో ఉపకరిస్తుంది పొన్నగంటి కూర. అంతే కాదు, దీని వల్ల బరువు తగ్గడం, పెరగడం, శరీర సౌష్టవం పెరగడం వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
రక్తాన్ని శుద్ధి చేసేందుకు.. 
శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును కట్ చేసి.. పెసరపప్పు, చిన్న ఉల్లి పాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది.
బరువు తగ్గాలనుకునే వారు 
పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అదే బరువు పెరగాలనుకునే వారు
కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు.
ఎక్కువ ఎండల్లో తిరిగి పనిచేసే వారికి, గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. కంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటి సమస్యలు ఎదురైతే.. పొన్నగంటి ఆకుతో తాలింపు చేసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది.
ఇంకా ఈ ఆకుకూర నోటి దుర్వాసనను పోగొడుతుంది. అలాగే గుండెకు, మెదడుకు ఉత్సాహాన్నిస్తుంది.
Loading...

Popular Posts