మీరు కనుక రోజులో ఇది మర్చిపోయారో మీకు షుగర్ వ్యాధి తొందరగా ఎటాక్ అవుతుంది

రోజులో మిగిలిన భోజనాలు మానేసినా ఫర్వాలేదు కానీ, బ్రేక్‌ఫాస్ట్‌ విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదట. ఓ అధ్యయనం ప్రకారం ఎక్కువ రోజులు ఉదయంపూట అల్పాహారం తీసుకోవడం మానేసిన వారు తొందరగా డయాబెటిస్‌ బారిన పడతారని తేలింది.

బ్రేక్‌ఫాస్ట్‌ ఎందుకు తీసుకోవాలంటే...

ముందురోజు రాత్రి తీసుకున్న డిన్నర్‌కు, తర్వాతి రోజు ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌కు మధ్యలో దాదాపు ఎనిమిది గంటల విరామం ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోతే ఆ విరామం మరింత పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

  • అప్పటివరకు చాలా తక్కువగా ఉన్న బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయులు సాధారణ స్థితిలోకి రావాలంటే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాల్సిందే.
  • బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోతే ఆ రోజంతా చాలా డల్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఆకలితో చేతికందిన ఫ్యాటీ ఫుడ్‌ తినేసే ప్రమాదముంది.
  • ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరి.
  • బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోనివారిలో ఆ రోజంతా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందట.
  • బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోతే మెటబాలిజమ్‌లో తేడా వచ్చేస్తుంది.
  • అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ను తప్పనిసరిగా నిద్రలేచిన రెండు గంటలలోపునే తీసుకోవాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)