మ‌నం ఉప‌యోగించే కొన్ని వ‌స్తువుల‌ను మాత్రం ఇత‌రుల‌కు ఇవ్వ‌కూడ‌దు. మ‌నం కూడా ఇత‌రుల‌కు చెందిన ఆ వ‌స్తువుల‌ను వాడ‌కూడ‌దు ఆ వ‌స్తువులేమిటో తెలుసుకుందాం రండి.

ఒక‌రు వాడిన వ‌స్తువులు మ‌రొక‌రు వాడ‌కూడ‌ద‌ని సైన్స్ కూడా చెబుతోంది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే మ‌నం ఉప‌యోగించే కొన్ని వ‌స్తువుల‌ను మాత్రం ఇత‌రుల‌కు ఇవ్వ‌కూడ‌దు. మ‌నం కూడా ఇత‌రుల‌కు చెందిన ఆ వ‌స్తువుల‌ను వాడ‌కూడ‌దు. లేదంటే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి.  అయితే ఇలాంటి విశ్వాసాల‌ను కొంద‌రు మూఢ న‌మ్మ‌కాలుగా కొట్టి పారేస్తారు. కొంద‌రు బాగా న‌మ్ముతారు. ఇంత‌కీ మ‌నం వాడకూడ‌ని ఇత‌రులకు చెందిన ఆ వ‌స్తువులేమిటో తెలుసుకుందాం రండి.

మంచం…
అవును. మ‌నం ఇత‌రుల మంచంపై ప‌డుకోకూడ‌దు. లేదంటే వారిలోని వైబ్రేష‌న్స్ మ‌న‌కు వ‌స్తాయి. ఆ క్ర‌మంలో మ‌న‌కు ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయి. అంతేకాదు ఆరోగ్యం కూడా బాగుండ‌దు.

దుస్తులు…
సాధార‌ణంగా స్నేహితులు, కుటుంబ స‌భ్యులు లేదా బంధువుల్లో మ‌నం మ‌న శ‌రీరానికి త‌గిన‌ట్టుగా ఉండే ఇత‌రుల దుస్తుల‌ను ఎక్కువ‌గా ధ‌రిస్తాం. అయితే అలా ఒక‌రి దుస్తుల‌ను మ‌రొక‌రు ధ‌రించ‌కూడ‌దు. అలా చేస్తే జీవితంలో అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయి.

డ‌బ్బు…
ఇత‌రుల డ‌బ్బుపై ఎప్పుడూ క‌న్నేసి ఉండే వారికి ఎప్పుడూ దుర‌దృష్ట‌మే వ‌స్తుంది. అందుకే మ‌నం మ‌న‌కు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి. ఇత‌రుల‌కు ఉన్న దాని గురించి మ‌నం ఆలోచించ‌కూడ‌దు. అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా వెంట‌నే రుణ భారం తీర్చేసుకోవాలి.

పెన్ను…
ఒక‌రి వ‌ద్ద ఉన్న పెన్నును మ‌రొక‌రు తీసుకుని వాడ‌డం మ‌నం చాలా సంద‌ర్భాల్లో చూస్తుంటాం. ముఖ్యంగా బ్యాంకుల్లో. అయితే ఇలా ఒక‌రి పెన్ను తీసుకుని వాడితే ఆర్థిక స‌మ‌స్య‌లు క‌లుగుతాయి. అందుక‌ని అలా కూడా చేయ‌కూడ‌దు.

రిస్ట్ వాచ్‌…

ఇత‌రుల రిస్ట్ వాచీల‌ను అస్స‌లు ధ‌రించ‌కూడ‌దు. అలా ధ‌రిస్తే వారిలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ మ‌న‌కు వ‌స్తుంది. దీంతోపాటు ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి.

Popular Posts

Latest Posts