వంటల్లో ఇంగువా వాడుతున్నారా ? అసలు ఇంగువా అంటే ఏంటి ? దీన్ని రోజూ వంటలో వాడితే దీని అద్భుతమేంటో మీకే తెలుస్తుంది

Loading...
ఇంగువ వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం. ఇంగువ మొక్క కాండం నుండి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. ఒక మూడునెలలో తయారైన ద్రవం రాయిలాగా తయారవుతుంది. ఇది పసుపు రంగులో ఉండి బాగా తీవ్రమైన వాసనతో ఉంటుంది. భారతదేశ వంటల్లో ముఖ్యంగా దీనిని విరివిగా వాడుతుంటారు. అలాంటి ఇంగువ ఉపయోగాలేంటో తెల్సుకుందాం!

కడుపులో మంట, జీర్ణసమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. క్యాబేజీ, బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్‌ చేరుకుని ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్‌ సమస్య
ఉండదు.
ఇంగువకి రోగనిరోధక శక్తి ఎక్కువ. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. నెలసరి సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభిస్తుంది. అజీర్తితో బాధపడే వారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
Loading...

Popular Posts