ఆడపిల్లలను రక్షించడానికి ఓ డాక్టర్ చేస్తున్న కృషి.. తన హాస్పిటల్ లో ఆడపిల్ల పుడితే బిల్ ఉండదు మందులు కూడా ఫ్రీ

Loading...
మ‌హారాష్ట్ర‌లోని పూణెలో డాక్ట‌ర్ గ‌ణేష్ రాఖ్ అనే ఓ వైద్యుడు సొంత‌గా హాస్పిట‌ల్ న‌డుపుతున్నాడు. కాగా అత‌ని హాస్పిట‌ల్‌లో సాధార‌ణ అనారోగ్యాల‌కు చికిత్స కోస‌మే కాకుండా ప్ర‌స‌వం కోసం గ‌ర్భిణీ మ‌హిళ‌లు కూడా వ‌చ్చేవారు. అలాంటి మ‌హిళ‌ల‌కు చెందిన కుటుంబ స‌భ్యులు, వారి బంధువులు త‌మ‌కు కొడుకే జ‌న్మించాల‌ని ప్రార్థించేవారు. ఈ క్ర‌మంలో కొంద‌రికి కొడుకే పుట్టేవాడు. అలాంటి వారు హాస్పిట‌ల్‌లోనే వేడుక‌లు జ‌రుపుకునే వారు. కూతురు జ‌న్మించిన వారు మాత్రం ప్ర‌స‌వించిన మ‌హిళ‌ను, ఆ శిశువును చూడ‌కుండానే వెళ్లిపోయేవారు. అలాంటి వారంద‌రినీ డాక్ట‌ర్ గ‌ణేష్ రాఖ్ ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించాడు. దీంతోపాటు ప్ర‌తి ఏటా బాలురు, బాలిక‌ల నిష్ప‌త్తి త‌గ్గిపోతుండ‌డాన్ని కూడా అత‌ను గ‌మ‌నించాడు. దీంతో ఎలాగైనా ఆడ శిశువును ర‌క్షించాల‌ని, వారు కూడా మ‌గ శిశువుల‌తో స‌మానమేన‌ని నిరూపించాల‌ని అనుకున్నాడు. అలా అనుకుని ఎవ‌రూ తీసుకోని ఓ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నాడు. అదేమిటంటే త‌న హాస్పిట‌ల్‌కు ప్ర‌స‌వం కోసం వ‌చ్చే మ‌హిళ‌ల‌కు ఒక వేళ ఆడ‌శిశువు పుడితే ఆ కుటుంబం నుంచి ఎలాంటి ఫీజు, బిల్స్‌ తీసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాడు.

అయితే డాక్ట‌ర్ గ‌ణేష్ రాఖ్ తీసుకున్న నిర్ణ‌యం అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు న‌చ్చ‌లేదు. హాస్పిట‌ల్‌లో ఫీజులు, బిల్స్ తీసుకోక‌పోతే మ‌నం ఎలా జీవించాల‌ని వారు అత‌న్ని ప్ర‌శ్నించారు. కానీ గ‌ణేష్ రాఖ్ తండ్రి ఆదినాథ్ విఠ‌ల్ రాఖ్ మాత్రమే త‌న కొడుకు నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించాడు. దీంతో గ‌ణేష్‌కు ధైర్యం ల‌భించింది. ఆ తెగువ‌తోనే తాను అనుకున్న‌ది పాటించ‌డం మొద‌లు పెట్టాడు. అప్ప‌టి నుంచి త‌న హాస్పిట‌ల్‌కు వ‌చ్చే గ‌ర్భిణీ మ‌హిళ‌లెవ‌రైనా ఆడ శిశువును జ‌న్మిస్తే వారి నుంచి ఎలాంటి డ‌బ్బులు తీసుకునేవాడు కాదు. పైపెచ్చు తానే స్వ‌యంగా ఖ‌ర్చు పెట్టుకుని ఆ ఆడ శిశువుల జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డం మొద‌లు పెట్టాడు.

డాక్ట‌ర్ గ‌ణేష్ చేస్తున్న సామాజిక సేవను అక్క‌డి ప్ర‌జా ప్ర‌తినిధులే కాదు, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌నే స్వ‌యంగా మెచ్చుకున్నాడు. దీంతో అత‌ని కార్య‌క్ర‌మానికి ఎలాంటి స్పంద‌న వ‌చ్చిందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. కాగా ప్రస్తుతం డాక్ట‌ర్ గ‌ణేష్ ప్రైవేట్ హాస్పిట‌ల్ వైద్యుల‌ను కోరుతున్న‌ది ఒక్క‌టే. ఆడ శిశువును ప్ర‌సవించే మ‌హిళ‌ల కుటుంబాల‌కు త‌న‌లా కాకున్నా క‌నీసం నెల‌కు ఒక్క‌రికైనా ఉచితంగా సేవ‌ల‌ను అందించాల‌ని కోరుతున్నాడు. అవును మ‌రి. అత‌ను చెబుతోంది నిజ‌మేగా. దాని వ‌ల్లైనా స‌మాజంలో ఎంతో కొంత మార్పు వ‌స్తుంది. అప్పుడు ఆడ శిశువుల మ‌ర‌ణాలు వాటంత‌ట అవే ఆగిపోతాయి. అంతే క‌దా!
Loading...

Popular Posts