ఆవలింతలు ఎందుకు వస్తాయో తెలుసా ? ఆవలింతలు గురించి ఆశ్చర్యకరమైన నిజాలు

వైద్యులు చెబుతున్న దాని ప్ర‌కారం శ‌రీరం అల‌స‌టకు లోనైన‌ప్పుడు ఈ ఆవ‌లింత‌లు వ‌స్తాయి. ఆవలింత‌లు అంటు వ్యాధి ర‌కానికి చెందిన‌వి కాక‌పోయిన‌.. ప్ర‌తిస్పంద‌న‌ల ర‌కానికి చెందిన ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్య అని చెప్తారు. అంటే ఆవలించే ఇతర వ్యక్తులను చూసినప్పుడు మనలో కూడా ఆటోమేటిక్ గా ఆవలింతలొస్తాయన్నమాట.
అస‌లు ఆవ‌లింత‌లు ఎప్పుడెప్పుడు వ‌స్తాయంటే..
శ‌రీరం పూర్తిగా అల‌సిపోయి నిద్ర‌కు వేళాయే అని పిలిచిన‌ప్పుడు ఆవలింతలు వాటంతట అవే వస్తాయి. మనుషులకే కాదు జంతువులకు కూడా ఆవ‌లింతలు వస్తాయి.
త‌ల్లి క‌డుపులో ఆవ‌లింత
ఆవ‌లింత త‌ల్లి గ‌ర్భంలో ఉండ‌గానే మొద‌ల‌వుతుందంట‌. 11 వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. దీన్ని బ‌ట్టి చూస్తుంటే భూమి మీద‌కు రాక ముందే ఆవ‌లింత మ‌న‌కి ద‌గ్గ‌ర‌వుతుంద‌న్న మాట‌. అంటే ఆవ‌లింతే మ‌న ఫ‌స్ట్ ఫ్రెండ్.
ఆవ‌లింత‌కు నిద్ర లేపే గుణం
నిద్ర ముంచుకు వ‌స్తుంద‌ని తెల‌ప‌డ‌మే కాదు.. నిద్ర‌లో ఉన్న శ‌రీరాన్ని రీప్రెష్ చేసేందుకు కూడా ఆవ‌లింత వ‌స్తుందట‌. ఈ ఆవ‌లింత‌తో శ‌రీరానికి ఉండే లేజీ నెస్ వెళ్లిపోతుంది.
ఆవ‌లింత‌కు కొస‌రు కార‌ణం
మనకి బోర్ కొట్టినప్పుడు లేదా నిద్ర ముంచుకు వ‌చ్చిన‌ప్పుడు ఆవలింత వ‌స్తుంది. బుక్స్ చదివేటప్పుడు చాలా మంది ఆవలించడాన్ని గమనించే ఉంటారు. అయితే ఆవలించడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మెద‌డు మరింత షార్ప్ గా పనిచేస్తుంది. మ‌నకు ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయంటే దానర్ధం, మెద‌డు త‌న‌ని తాను యాక్టివ్ గా ఉంచుకోవ‌డానికి ప్రయత్నిస్తుందని అర్థం.
ఆవ‌లింత ఎంత సేపు ఉంటుంది
మ‌నకొచ్చే ఒక్కో ఆవ‌లింత‌ సగటున 6 సెకన్ల వరకూ ఉంటుంది.
జీవిత కాలంలో ఎన్ని సార్లు ఆవలిస్తాము:
మనిషి స‌గ‌టు జీవిత కాలంలో 400 గంటలు ఆవలించడానికి పోతాయి. అది కూడా పుట్ట‌క ముందు నుండి లెక్కెస్తారంట. అంటే జీవిత‌కాలంలో 16 నుండి 17 రోజులు ఆవ‌లింత‌ల‌కే పోతాయ‌న్న‌మాట‌.
ఇక చివ‌ర‌గా ఆవ‌లింత గురించి ఓ మాట.. ఆవ‌లింత తీసుకుంటున్న స‌మ‌యంలో మ‌న మెద‌డుకు ఎక్కువ ఆక్సిజ‌న్ అవ‌స‌రం అవుతుంది. సో నెమ్మ‌దిగా ఆవ‌లింత ప‌నిని ఆవ‌లింతను చేసుకోనివ్వండి.

Popular Posts

Latest Posts