చేదుగా ఉంటుందని కాకర కాయను మానేస్తున్నారా ? అయితే మీరు జీవితంలో చాలా కోల్పుతున్నారు

కాకర కాయను చూస్తేనే చిన్నా.. పెద్దా అందరికీ చిరాకే. చేదుగా ఉంటుందని దీన్ని తినడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం కష్టమైనా, ఇష్టంలేకపోయినా తినేస్తారు. అవును కాకరకాయ రుచి చేదుగా ఉన్నప్పటికి ఇందులో చాలా పోషకవిలువలు ఉన్నాయి. అనేక రోగాలను నయం చేసే దివ్యౌషధం కాకర.

కాకరకాయను తరచుగా తీసుకోవడం వల్ల రక్తపోటు, హైబీపీ, అలర్జీలు దూరం చేసుకోవచ్చు. అలాగే అందరినీ బెంబేలెత్తించే.. చాలామంది బాధపడుతున్న డయాబెటిస్ కి చెక్ పెట్టవచ్చు. కాకరకాయను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. కాబట్టి డయాబెటిస్ పేషంట్స్ డైట్ లో కాకరకాయను ఎక్కువగా ఉపయోగించడం మంచిది. 

కాకరకాయను రకరకాలుగా వండుతారు. ఫ్రై చేసినా, పులుసు పెట్టినా రుచికరంగా ఉంటుంది. కాకపోతే కాస్త చేదు మాత్రం నాలుకకు తగులుంది. దీనివల్ల దీన్ని తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఇందులో ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఔషధగుణాలున్న కాకరను తినడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది.

కాకరకాయలో కడుపులో నులి పురుగులను నాశనం చేసే గుణం కూడా ఉంది. అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే అలర్జీ, స్కిన్ ప్రాబ్లమ్స్, సొరియాసిస్ వంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది. కాబట్టి ఇకపై కాకరకాయ అంటే నిర్లక్ష్యం చేయకుండా.. కొంచెమైనా తినడం అలవాటు చేసుకోండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)