నిగనిగలాడే ఒత్తయిన పొడవైన నల్లని జుట్టు మీ సొంతం కావాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి

Loading...
నిగనిగలాడే ఒత్తయిన నల్లని జుట్టు మీ సొంతం కావాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి.
  • తలస్నానానికి ముందు కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడి చేసి శిరోజాలకు పట్టించాలి. దీనివల్ల జుట్టుకి చక్కని మెరుపు, నునుపు వస్తుంది. 
  • తలస్నానం వీలైనంత వేగంగానే ముగించి శిరోజాలను ఆరబెట్టుకోండి. గంటల తరబడి జుత్తును తడిగానే ఉంచేయడం మంచిది కాదు. అంతేకాదు, బిజీగా ఉన్నామని జుట్టును ఆరబెట్టుకోవడానికి డ్రయర్లను వాడటం పరిపాటి. ఇలా డ్రయర్లుతో జుట్టు ఆరబెట్టుకోవటం వల్ల జుట్టులో పగుళ్ళు ఏర్పడటం, బలహీనపడి రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి సహజపద్ధతుల్లోనే జుట్టుని ఆరబెట్టుకోవాలి.
  • శిరోజాలకు రంగులు వేసే అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. ఎందుకంటే రంగులలోని రసాయనాల వలన 20శాతం జుట్టు కోల్పోతారు. 
  • పళ్ళు దగ్గరగా ఉండి మొనదేలిన దువ్వెనలను ఉపయోగించకూడదు. దీని వల్ల జుట్టు చివర్ల చిట్లిపోవడమే కాకుండా, మొదళ్ళ భాగంలో ఉండే సున్నితమైన భాగంలోని చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. పళ్ళు దూరంగా ఉండే దువ్వెనలను మాత్రమే వాడాలి.
  • పరిశుభ్రమైన నీరు తాగాలి. అంటే రోజుకు కనీసం 12 నుండి 14 గ్లాసులు తాగితే శిరోజాలకే కాదు, ఆరోగ్యానికీ మంచిది. కొవ్వు తక్కువుండే పాలు, పాల ఉత్పత్తులు, నట్స్‌, పచ్చని ఆకుకూరలు, తాజా కూరగాయలు మీ రెగ్యులర్‌ డైట్‌లో ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎంతో తోడ్పడతాయి.
Loading...

Popular Posts