గోమూత్రంలో బంగారం... తాజా పరిశోధనలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయం

గోమూత్రం ఔషధాల నిలయమని ఎప్పటి నుండో నమ్మకాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇది అనేక పరిశోధనలలో కూడా నిరూపించారు. గోమాతను చాలామంది దైవంగా భావిస్తూ.. గోవును తాకితేనే పాపాలు హరించిపోతాయని భావిస్తారు. అయితే గోమూత్రంలో బంగారం దాగుందనే సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గిర్ జాతి ఆవుల మూత్రంపై గుజరాత్‌ లోని జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయింది.

400 గిర్ ఆవుల నుంచి సేకరించిన మూత్రం నమూనాలను జేఏయూలోని ఆహార పరీక్ష ల్యాబ్‌ లో లో పరీక్షించగా లీటర్ మూత్రంలో మూడు నుంచి 10 మిల్లీ గ్రాముల బంగారం ఉన్నట్టు బయటపడింది. అయాన్ల రూపంలో బంగారం ఉన్నట్టు పరిశోధనకారులు వెల్లడించారు. గో మూత్రంలో బంగారం ఉంటుందని పూర్వీకులు చెప్పగా వినడమే తప్ప ఇంతవరకు శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని.. ఈ విషయాన్ని తేల్చేందుకే తామీ పరిశోధన చేపట్టినట్టు గొలాకియా తెలిపారు.

400 గిర్ ఆవుల నుంచి సేకరించిన మూత్రం శాంపిల్స్‌లో బంగారం ఉన్నట్టు తాము కనుగొన్నామని.. ఒంటెలు, గేదెలు, గొర్రెలు, మేకల నుంచి సేకరించిన మూత్రంపైనా పరిశోధనలు చేయగా అందులో యాంటీ బయోటిక్ పదార్థాలు కనిపించలేదని.. గోమూత్రంలో బంగారంతో పాటు పలు ఔషధ గుణాలను కూడా తాము కనుగొన్నట్టు గొలాకియా పేర్కొన్నారు.

Popular Posts

Latest Posts