కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఖచ్చితంగా తెలుసుకోవలసిన నాలుగు విషయాలు

Loading...
పెళ్లికి ముందు తనకు కాబోయే వాడి గురించి ప్రతీ అమ్మాయి ఎన్నెన్నో కలలు కంటుంది. ఆ కలలను నిజం కావాలని కోరుకుంటుంది. కొంతమంది ఈ నిజంలో సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతుంటారు. కొంతమంది మాత్రం అభిప్రాయభేదాలతో దాంపత్యంలో సుఖం లేకుండా జీవిస్తుంటారు. అలాంటి వారు కూడా తమ జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో భర్త కంటే భార్యకే ఎక్కువ బాధ్యత ఉందని చెబుతున్నారు. ఈ నాలుగు విషయాల్లో తమను తాము నియంత్రించుకుంటే అమ్మాయిలు కలలు కన్న జీవితం సొంతమవుతుందట.

కొత్తగా పెళ్లైన అమ్మాయి మెట్టినింట్లో అడుగుపెట్టగానే అత్తను అనుకరించడానికి ప్రయత్నించాలి. అప్పుడే అత్త దృష్టిలో, మీ భర్త దృష్టిలో మీరో మంచి ఇల్లాలనిపించుకుంటారు. అత్త అధికారం కొద్దీ ఒకమాటన్నా సహనంతో సర్దుకుపోవాలి. లేకపోతే వేరు కాపురాలు... వేరు కుంపట్లు తప్పవు.

మంచి భార్యగా భర్త దగ్గర మార్కులు కొట్టేయ్యాలంటే ఒక్కటే మార్గం. మీ అవసరాల కంటే భర్త అవసరాలకే విలువనివ్వండి. అప్పుడే మీ అవసరాలను భర్త గుర్తిస్తాడు.

ఒక్కసారి పుట్టినింటి నుంచి మెట్టినింట్లో కాలుమోపాక ఇంటి పేరే కాదు... బంధాల మధ్య దూరాలు పెరిగిపోతాయి. భార్య తన అమ్మానాన్నను చుట్టాలుగానే భావించాలి తప్ప కుటుంబ సభ్యులులా చూడకూడదు. అలా భావిస్తే భార్యాభర్తల మధ్య అంతరం పెరిగే అవకాశముంది.

ఏ బంధంలోనైనా అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ భార్యాభర్తల మధ్య అవి అనవసర రాద్దాంతానికి దారితీస్తాయి. మగాళ్లకు అహం ఉంటుంది. అందువల్ల స్త్రీలే సహనంతో వ్యవహరించాలి. భూదేవికున్నంత ఓర్పు స్త్రీకి ఉందని పెద్దలు ఊరికే అన్నారా.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...