బ్రేక్ ఫాస్ట్ తినడం చాల అవసరం, లేదంటే చాలా నష్టాలు.. ఎన్ని నష్టాలంటే ?

Loading...
బ్రేక్ ఫాస్ట్ అనే పదానికి అర్ధం ఏమిటో మీకు తెలుసు కదా బ్రేక్ ది ఫాస్ట్ అని. రాత్రి తిని పడుకొని లేచి కాలకృత్యాలు తీర్చుకోని టిఫిన్ దగ్గర కూర్చొని తినే వరకు రాత్రి నుంచి అప్పటి వరకు మనం ఉపవాసం ఉన్నట్టే. ఆ ఫాస్టింగ్ ని బ్రేక్ చేస్తాము కాబట్టి బ్రేక్ ఫాస్ట్ అని పేరు పెట్టారు. బ్రేక్ ఫాస్ట్ తినడం చాల అవసరం, లేదంటే చాలా నష్టాలు ఉన్నాయి.

బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వలన శరీరంలోకి సరిపడా కాలరీలు చేరక శక్తీ ఉండదు. దీనివలన హుషారుగా రోజు స్టార్ట్ అవ్వదు, మత్తుగా ఉండటం, నిద్రలోకి జారుకోవడం, సాయంత్రం అవగానే అలసిపోవడం జరుగుతాయి.

కొతమంది లేవడమే లేటుగా లేచి ఏకంగా మద్యాహ్నం భోజనం చస్తారు. ఈ అలవాటు వలన ఎక్కువ సేపు ఉపవాసం ఉన్న కారణంగా గ్యాస్ ప్రొబ్లెమ్స్ మరియు రకరకాల హెల్త్ ఇష్శ్యూస్ వస్తాయి.

బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోకపోతే మన జీర్ణక్రియ దెబ్బ తినటం, కడుపులో మంట అల్సర్ లాంటి ప్రమాదాలు వస్తాయి. అలాగే మన జీవక్రియ దెబ్బతిని, కాలరీలు సరిగా ఖర్చవక, శరీరం లావేక్కే ప్రమాదం ఉంటుంది . అంతే కాకుండా ఆకలి ఎక్కువగా వేసి మద్యాహ్నం లంచ్ ఎక్కువగా తింటాము. దీని వలన శరీరం యొక్క బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుంది. అందుకని బ్రేక్ ఫస్ట్ ని బ్రేక్ లేకుండా ప్రతీ రోజు తీసుకోండి.
Loading...

Popular Posts