బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ తప్పులు అస్సలు చేయకూడదు

ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువున్న వ్యక్తులు తమ బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎవరేమి చెప్పినా తూచా తప్పక పాటిస్తారు. అయితే ఈ క్రమంలో వారు చేసే కొన్ని తప్పులే వారు బరువు తగ్గేందుకు అడ్డుపడుతున్నాయి. అవేంటో చూద్దాం..

1) సరిపడా నిద్ర ఉండాలి
బరువు తగ్గడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు డైటింగ్‌ కూడా చేస్తున్నవారు రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. బరువు తగ్గడంలో నిద్రది కూడా కీలకపాత్రే. సరిపడా నిద్ర లేకపోతే క్యాలరీలు కరగడం కష్టమవుతుంది.

2) ఆ నిష్పత్తి 80:20 ఉండాలి
బరువు తగ్గడంలో డైటింగ్‌దే ప్రముఖ పాత్ర. చాలామంది ఎక్కువ సమయం వ్యాయామం చేస్తూ.. డైటింగ్‌ విషయంలో మాత్రం పెద్దగా కేరింగ్‌ తీసుకోరు. నిజానికి బరువు తగ్గడంలో డైటింగ్‌ 80 శాతం పాత్ర పోషిస్తే.. వ్యాయామానిది కేవలం 20 శాతం మాత్రమే.

3) త్వరగా తినడం మంచిదే.. కానీ
చాలా మంది రాత్రి పూట త్వరగా తినమని చెబుతారు. అలా తినడం మంచిదే. అయితే తిన్న రెండు గంటల తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. సాయంత్రం ఏడు గంటలకే భోజనం చేసి రాత్రి పన్నెండు గంటల వరకు మేల్కోని ఉండడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ సమయంలో మళ్లీ ఆకలేస్తుంది. కేవలం నిద్రపోవడానికి రెండు గంటలు ముందు తింటే చాలు.

4) శరీరం చెప్పేది వినండి..
చాలామంది డైటింగ్‌, వ్యాయామం విషయంలో పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకుంటారు. అయితే ఆ సమయంలో శరీరం చెప్పేది కూడా వినాలి. ఎప్పుడైనా తీవ్రంగా అలసిపోయి వ్యాయామం మానెయ్యాలనిపిస్తే.. ఒక్కరోజు మానెయ్యడం వల్ల పెద్దగా ప్రమాదమేదీ ఉండదు. అలాగే అప్పుడప్పుడు ఇష్టమైన ఆహారం కొద్ది మోతాదులో తీసుకున్నా ఫర్వాలేదు.

5) ఇవి అస్సలు వద్దు..
చాలామంది డైటింగ్‌ పేరుతో సాధారణ ఆహారానికి బదులుగా ప్రొటీన్‌ షేక్‌, ప్రొటీన్‌ బార్స్‌, మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్స్‌ వాడుతుంటారు. అవి వాడొచ్చు గానీ.. వాటి కోసం రోజూ తినాల్సిన ఆహారాన్ని దూరం పెట్టడం సమంజసం కాదు. ఓ కాల్షియం ట్యాబ్లెట్‌ వేసుకోవడం కంటే.. ఓ గ్లాసుడు పాలు తాగడం ఎంతో మేలు చేస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)