పేరులోని A,E,I,O,U అచ్చులను లెక్కపెట్టండి వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళో ఈజీగా తెలిసిపోతుంది

పేరులోని ఇంగ్లీష్ అచ్చులు ( A,E,I,O,U) ల ప్రకారం మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. దీని కొరకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. వాటిని ఈవిధంగా ఫాలో అవ్వండి.
A=1

E=2

I=3

O=4

U=5

ఉదాహరణకు పవన్ కళ్యాణ్ పేరుని తీసుకుందాం
Step:1
ఇంటి పేరుతో సహా మీ మొత్తం పేరును ఇంగ్లీష్ లో రాయండి.
Ex: Konidela Pawan Kalyan
Step:2
ఈ పేరులో ఉన్న అచ్చులను అంటే A E I O U లను మాత్రమే ఓ పక్కకు రాసుకోండి.
Ex : పై పేరులోని అచ్చులను సెపరేట్ గా రాస్తే. O I E A___ A A A A
Step: 3
వరుస క్రమాన్ని బట్టి ఈ అచ్చులకు నెంబరింగ్ ఇవ్వాలి అంటే .
Ex: పై పేరును బట్టి. O=4, I=3, A=1 ____ A=1, A=1, A=1, A=1
Step:4 
అన్నింటిని కూడాలి.
Ex: పై పేరు ప్రకారం…. అన్నింటిని కూడితే……4+3+1+1+1+1+1 = 12
Step:5
సింగిల్ నెంబర్ వచ్చే వరకు ఫైనల్ నెంబర్ ను కూడాలి.
Ex:1+2 =3
ఇప్పుడు ఫైనల్ గా వచ్చే నెంబర్ ను బట్టి వారి వ్యక్తిత్వాన్ని ఈ విధంగా అంచనా వేయాలి.

ఇప్పుడు ఫైనల్ గా ఏ నెంబర్ అయితే వస్తుందో దానిని బట్టి ఈ విధంగా వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకోండి
  • నంబర్ 1 అయితే - పుట్టుకతోనే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎల్లప్పుడు పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో ఒకరిగా కాక వారిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. వీరిలో సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు తలెత్తే ఇగో సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
  • నంబర్ 2 అయితే - వీరు తమ సొంత నైపుణ్యాలతో జీవితంలో పైకి ఎదుగుతారు. లక్ష్యసాధన దిశగా పనిచేసే అలవాటును కలిగి ఉంటారు. అయితే కొన్ని సార్లు ఎమోషన్ అవుతుంటారు. ఈ సందర్భంలోనే ఇలా ఎమోషన్ అయి ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు.
  • నంబర్ 3 అయితే - వీరు ఎల్లప్పుడూ సాహసాలను చేయాలని కోరుకుంటారు. ఇతరుల పట్ల మంచి కమ్యూనికేషన్‌ను కలిగి ఉంటారు. ఇతరులను పాజిటివ్ దిశగా నడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో వీరిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు.
  • నంబర్ 4 అయితే - వీరిలో అనంతమైన శక్తి దాగి ఉంటుంది. కానీ దాని గురించి వారికి తెలియదు. ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో అప్పుడప్పుడు విఫలమవుతుంటారు.
  • నంబర్ 5 అయితే - వీరు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్నిసార్లు వీరిలో ఓర్పు నశిస్తుంది. ఓర్పును జయించి కష్టపడితే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు.
  • నంబర్ 6 అయితే - వీరు ఎల్లప్పుడూ తాము చేసే పనిలో కచ్చితత్వం కోరుకుంటారు. ఇది వారిని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. అయితే వీరు ఇతరుల పట్ల స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ వారికి సహాయం చేస్తారు. ఇది వారికి మరింత ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పట్టుదలకు పోతుంటారు.
  • నంబర్ 7 అయితే - వీరు మంచి ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. విశ్లేషణాత్మక మనసు కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా వెనక్కి తగ్గరు. కొన్ని సందర్భాల్లో వీరు స్వార్థపూరితంగా ఉంటారు.
  • నంబర్ 8 అయితే - వ్యాపారంపై మంచి అవగాహన కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ అదే ధ్యాసలో ఉంటారు. వీరు మంచి పరిపాలన నైపుణ్యాలు కలిగి ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగి ఉండడంతో అది వారి కొంప ముంచే అవకాశం ఉంటుంది.
  • నంబర్ 9 అయితే - వీరు సృజనాత్మకమైన ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఇతరులకు వీరు ప్రేరణగా నిలుస్తారు. అయితే సొంత విషయంలో మాత్రం అంతగా శ్రద్ధ చూపరు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)