శరీరంలో చెడు కొవ్వుని కరిగించుకోవటానికి ఈ 7 పదార్ధాలు బాగా ఉపయోగపడతాయి

బరువు తగ్గించుకోవడానికి ఎన్నో షాట్‌కట్‌ చిట్కాలను, మందులను వాడుతుంటారు చాలా మంది. కానీ అవి శరీరాన్ని తగ్గించకపోగా నీరసాన్ని పెంచుతాయి. అందుకే శరీరాన్ని శ్రమ పెట్టే వ్యాయామాలు చేయడంతో పాటు వంటింట్లో లభించే దినుసులను ఉపయోగించుకుంటే చాలు.
వెల్లుల్లి :- దీనిలో ఉండే అలిసిన్‌ అనే రసాయనం యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. ఇది ఆహారపదార్థాలకు రుచిని ఇవ్వడమే గాక కొవ్వును కరిగిస్తుంది.

తేనె :- రోజూ పరగడుపునే పెద్దగ్లాసుడు నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల కడుపు శుభ్రపడుతుంది. ఈ మిశ్రమంలో కొవ్వును కరిగించే గుణాలు మెండుగా ఉన్నాయి.

టమాటా :- టమాటాకు క్యాన్సర్‌ కారకాలను నిర్వీర్యం చేసే లక్షణం ఉంది. అలాగే కొవ్వును నిరోధించే గుణం కూడా ఉంది. వంటకాలలో టమాటాను విరివిగా వాడటం ఎంతో లాభదాయకం.

గ్రీన్‌ టీ :- రోజూ గ్రీన్‌ టీ తాగడం ఎంతో మంచిది. గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు కొవ్వును కరిగించే లక్షణం కూడా మెండుగా ఉంది.

క్యాబేజీ :- క్యాబేజీలో స్థూలకాయాన్ని నివారించే లక్షణం ఉంది. దీనిలో క్యాలరీలు తక్కువ. చెడు కొవ్వును కరిగించి మంచి కొవ్వును పెంచుతుంది.

ఓట్స్‌, గుడ్డు :- ఓట్స్‌లో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. గుడ్డులో పోషకాలు అధికం. క్యాలరీలు చాలా తక్కువ. అందుకని ఓట్స్‌, గుడ్డు విరివిగా వాడటం వల్ల కూడా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)