ఈ 17 పదార్ధాలు ఇంట్లో ఉంటె.. తలలో చుండ్రు ని తరిమికొట్టచ్చు

Loading...
 • చుండ్రు నివారించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే అనేక షాంపూలు యాంటీ డాండ్రఫ్ పేరుతో ఉంటాయి. వీటన్నింటినీ ప్రయత్నించినా.. ఫలితం మాత్రం దక్కదు. ఇవి తలస్నానం చేసిన రోజు రిలీఫ్ ఇచ్చినా.. షరామామూలే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా అప్పటికప్పుడు కాకుండా.. శాశ్వతంగా చుండ్రు నివారించడానికి, చుండ్రురహిత స్కాల్ఫ్ పొందడానికి ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండవు. చుండ్రు నివారించుకోవడం ఎలాగో చూద్దాం...
 • కర్పూరం - కొబ్బరి నూనె: ఇది అమ్మమ్మల కాలం నాటి రిసిపి. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి మిక్స్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. అవసరమయినప్పుడు, రాత్రుల్లో నిద్రించడానికి ముందు అప్లై చేసుకోవాలి. కర్పూరం తలను కూల్ గా ఉంచుతుంది . చుండ్రు నివారిస్తుంది
 • కొబ్బరి నూనె - నిమ్మ రసం : హెయిర్ కేర్ రెమెడీస్ లో లెమన్ ఒక గ్రేట్ రెమెడీ. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. . అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
 • పెసరపిండి - పెరుగు: రెండు చెంచాలా పెసరపిండిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి , ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి . అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. శెనగపిండి హెయిర్ క్లెన్సర్ గా గ్రేట్ గా పనిచేస్తుంది మరియు తలను సుభ్రం చేస్తుంది. చుండ్రు నివారిచండంలో ఆయుర్వేదంలో ఇది ఒక బెస్ట్ రెమెడీ.
 • పెరుగు-నిమ్మరసం : చుండ్రు నివారించుకోవడానానికి ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం పిండి తలకు పట్టించడం వల్ల తల శుభ్రం చేస్తుంది. క్లియర్ అవుతుంది . నిమ్మరసం చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. . ఇది చాలా ఎఫెక్టివ్ టిప్ . పెరుగు జుట్టుకు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తలను కూల్ గా ఉంచుతుంది
 • వేప ఆకులు : వేప ఆకులను మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. అరగంట అలాగే ఉంచి తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి. చుండ్రు పూర్తిగా తొలగిపోవాలంటే వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది
 • హాట్ ఆయిల్ మసాజ్: తలకు నూనె అప్లై చేయడానికి ముందు నూనెను కొద్దిగా వేడి చేాయలి. . దీన్ని జుట్టులోపలి వరకూ అప్లై చేయాలి. 10 నిముషాల మసాజ్ చేసి తర్వాత ఒక గంట రెండు గంటల పాటు అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేయాలి.
 • బాదం మరియు ఆలివ్ ఆయిల్ : బాదం నూనెకు కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ చుండ్రు నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది . అలాగే తలకు పోషణను అందిస్తుంది. ఒక గంట , రెండు గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి
 • వెనిగర్ : రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ ను హాట్ వాటర్లో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల ఇది చుండ్రును మాయం చేయడంతో పాటు, తలను శుభ్రం చేస్తుంది .
 • పుదీనా ఆకులు - ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పు వేడి నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, అందులో కొద్దిగా పుదీనా ఆకులను మిక్స్ చేసి బాయిల్ అయిన తర్వాత చల్లార్చి , తలకు అప్లై చేయాలి. చేతివేళ్ళతో మర్ధన చేయాలి. తడి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
 • మెంతులు: మెంతులు జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది చుండ్రుని నివారించడంలో పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. రాత్రంతా మెంతులను నీళ్లలో నాననివ్వాలి. ఉదయాన్నే వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి ఒక కప్పు పెరుగు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు, స్కాల్ఫ్ కి పట్టించి రెండు గంటలపాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ చిట్కాని వారానికి రెండుసార్లు ప్రయత్నిస్తే.. మంచి ఫలితాలు పొందవచ్చు.
 • బ్లాక్ పెప్పర్: బ్లాక్ పెప్పర్ పౌడర్ లో మైక్రోబ్స్ ను, ఫంగస్ ను నాశనం చేసే లక్షణాలు ఉంటాయి. ఇది చుండ్రును, తలలో మొటిమలను నివారించే గుణాలు కలిగి ఉంటుంది. పద్దతి: బ్లాక్ పెప్పర్ ను మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. తర్వాత ఈ పౌడర్ లో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. మంచి షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఉత్తమ ఫలితం కోసం పెప్పర్ పౌడర్ కు నిమ్మరసం, పెరుగు జోడించి అప్లై చేసుకోవచ్చు.
 • కలబంద: కలబంద చుండ్రును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . మరియు చర్మంలో తేమను ఉంచతుంది. తలలో స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తుంది . చర్మంను హెల్తీగా ఉంచుతుంది. చుండ్రు ఏర్పడకుండా నివారిస్తుంది . అలోవెర యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది . దాంతో చుండ్రు నివారించడబడుతుంది.
 • గుడ్డు: రెండు గుడ్లను పగులగొట్టి సొనను బాగా గిలకొట్టాలి, ఈ సొనను తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి గోరువెచ్చిని నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు మరియు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. తలస్నానం చేసిన తర్వాత కోడిగుడ్డును జుట్టుకు పట్టించండి. ఇది మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. ఇది కూడా చుండ్రును తగ్గిస్తుంది.
 • ఉసిరికాయ పేస్ట్ : ఇది యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ . ఇందులో చుండ్రు నివారించే గుణాలు, ఇన్ఫ్లమేషన్ తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి బాగా మర్దన చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
 • శికాకాయ : శీకాకాయను పుదీనాతో మరియు మెంతి సీడ్స్ తో మిక్స్ చేసి, పేస్ట్ చేసి తలకు పట్టించాలి. లేదా వీటిని నీటిలో నానబెట్టి, ఆ నీటిని నిద్రించడానికి ముందు తలకు అప్లై చేయాలి. రాత్రంతా అలా ఉంచి తర్వాతి రోజు ఉదయం స్నానం చేయాలి. దీన్ని ఇంట్లో తయారుచేసుకోలేకపోతే, ఇది ఆయుర్వేదిక్ షాప్స్ లో అందుబాటులో దొరుకుతుంది, శీకాకయ చుండ్రుకు మాత్రమే కాదు, జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది .
Loading...

Popular Posts